Sunday, July 21, 2024

అక్రమాల ఆదిత్య..

తప్పక చదవండి
  • ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై మున్సిపల్ మంత్రికి అంత ప్రేమెందుకు..?
  • కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు, కొందరు పూర్తి అమౌంట్స్ తీసుకున్నారు..
  • ఇప్పటిదాకా వారికి ఫ్లాట్స్ అప్పజెప్పకపోవడానికి కారణం ఏమిటి..?
  • 6 ఏళ్ల క్రితమే డబ్బులు కట్టిన వారి బ్రతుకులు ఆగమేనా..?
  • ఆదిత్య వారు రిజిస్ట్రేషన్ చేసిన కొందరు కస్టమర్లు అమ్ముకోవాలంటే రిజిస్టేషన్లు జరగడం లేదు..
  • మాకు అధికార పార్టీ అండ ఉంది ఎవరూ ఏమీ చేయలేరంటున్న ఆదిత్య యాజమాన్యం..

హైదరాబాద్, అవినీతికి పరాకాష్టగా మారింది ఆదిత్య కన్ స్ట్రక్షన్స్.. 2015లో జీ.హెచ్.ఎం.సి. వారు అనుమతులు ఇవ్వడంతో.. అక్కడ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు ఆగమై పోతున్నారు.. 6 సంవత్సరాల క్రితం ఒక సొంత గూడు కోసం కన్న కష్టాలు పడి డబ్బులు చెల్లిస్తే ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాకుండా.. ఫ్లాట్స్ తమకు అందక కస్టమర్లు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. కొందరికి రిజిస్ట్రేషన్ అయినా.. అవసర నిమిత్తం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కావడం లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి..? సాంకేతిక లోపమా..? లేక అధికారులు చేసిన తప్పిదమా..? కాస్త ధైర్యం చేసి ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆదిత్య యాజమాన్యం తలతిక్క సమాధానాలు చెబుతున్నారు.. బెదిరింపుచర్యలకు పాల్పడుతున్నారు.. తమకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి అండదండలు పుషులంగా ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వమే తమ చెప్పు చేతల్లో ఉందని.. రేరా, హెచ్.ఎం.డీ.ఏ., రెవెన్యూ తదితర శాఖలు తమ ఆధీనంలో ఉన్నాయని, వారిని కాసులు వెదజల్లి కొనేశామని చెబుతూ.. మీరేమీ చేయలేరని.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ దమ్కీలు ఇస్తున్నారు.. మోసపోయిన బాధితులు ఏమి చేయాలో..? ఎవరికీ చెప్పుకోవాలో తెలియక సతమతమై పోతున్నారు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో ఉన్న కస్టమర్ల ప్రస్తుత పరిష్టితి ఇదే.. కాగా ఆదిత్య మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది.. సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి వీరికి అండగా ఉండటంతో అధికారులు అటువైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది.. కాగా రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, హఫీజ్ పేటలో సవేరా కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలు సర్వే నెంబర్ 78 పార్ట్ లో 2013లో జీ.హెచ్.ఎం.సి. కి కన్ స్ట్రక్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే 2015లో అనుమతులు లభించాయి.. ఇక్కడ ఫ్లాట్స్ కోసం డబ్భులు కట్టిన కస్టమర్స్ కి గడువులోపల అంటే 2020 లోపల నిర్మాణాలు పూర్తి చేసి, అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటికీ అక్కడ ఫ్లాట్స్ నిర్మాణాలు పూర్తి కాలేదు.. గడువు దాటిన తరువాత ఆ నిర్మాణాలు ఎక్స్ పైరీ అయిపోతాయి.. అలాంటి నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తగిన చర్యలకు పూనుకుంటుంది.. కానీ ఆదిత్య కన్ స్ట్రక్షన్ లో ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నా అటువైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు.. ఇదెలా సాధ్యం అవుతోందో అర్ధం కాదు.. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు అన్న చందాన.. అధికార ప్రభుత్వం అండ ఉంది కాబట్టి నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఆదిత్య వారు ఇంకా నిర్మాణాలు సాగిస్తున్నారు.. ఇక్కడ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో సమస్యలు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆదిత్య వారికి అమ్ముడు పోయిన కొందరు అధికారులు గానీ, అధికార ప్రభుత్వ పెద్దలు కానీ కస్టమర్లు తినీ, తినక చెమటోడ్చి కూడబెట్టుకున్న డబ్భులు చెల్లించిన వారికి ఆ డబ్భులు సదరు ఆదిత్య కన్ స్ట్రక్షన్ వారి దగ్గరనుండి రికవరీ చేసి తిరికి చెల్లిస్తారా..? సమాధానం చెప్పాలి.. మరి కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటి..? వారంతా రోడ్డుమీదకు రావలసిందేనా..? అసలు కళ్ళముందు ఇంతటి భారీ అక్రమ నిర్మాణం జరుగుతుంటే ప్రభుత్వం, అధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా..? జీ.హెచ్.ఎం.సి. కి వేలమంది అమాయకుల బ్రతుకులను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు..? ఒక సామాన్యుడు ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఆగమేఘాల మీద వచ్చి కూల్చేసే అధికారులకు ఈ భారీ అక్రమ నిర్మాణం కనిపించలేదంటే హాస్యాస్పదంగా ఉంది.. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం..

2014 నుంచి జరుగుతున్న ఈ భూ మాఫియా స్కాంలో అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపు కున్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో 6 ఏండ్ల నుంచి కస్టమర్స్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వాళ్ళు అమ్మినప్పుడే రిజిస్ట్రేషన్, మళ్లీ అమ్ముకోవడానికి వీలుండదు, రిజిస్ట్రేషన్ జరగదు. అంటే వారికి అను కూలంగా వ్యవస్థలను ఆదిత్య సంస్థ వారు ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

మోసగాళ్లకు అండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్..! :
సరైన పత్రాలు లేకుండానే లోన్స్ ఇచ్చే బ్యాంకు ఏదైనా ఉందంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. సీబీఐ కేసుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకుది మొదటి ర్యాంక్.. కస్టమర్లు తాము మోసపోయిన తర్వాత చివరకు ఫిర్యాదులు చేస్తుంటారు. బ్యాంకు మేనేజర్స్ కమీషన్స్ కి ఆశపడి ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును రుణాల రూపంలో ఇచ్చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. టైటిల్ లేకుండానే మరోకరికి భూమి వెళితే తీవ్రంగా నష్టం తప్పదు. ఇలా హైదరాబాద్ భూములపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఎన్నో మొండి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆదిత్య లోన్స్ పై కూడా దర్యాప్తు చేయాలని బ్యాంకర్స్ కి ఫిర్యాదులు అందుకున్నాయి.. పర్యవసానం ఏంటి అన్నది వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి..

ఈ వ్యవహారం వెనుక ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారాయి..? సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి అండ దండలతో ఆదిత్య రెచ్చిపోతోంది అన్న విమర్శల వెనుక దాగివున్న వాస్తవాలు ఏమిటి..? ఆదిత్య బాధితుల గోస ఏమిటి..? అసలు వారికి న్యాయం జరిగేనా..? పూర్తి వివరాలు ఆధారాలతో మీముందుకు తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు