Sunday, May 12, 2024

వేదికపైనే యుద్ధం..

తప్పక చదవండి
  • స్టేజ్ మీదనే కొటాడుకున్న కాంగ్రెస్ లీడర్లు..
  • తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల విభేదాలతో పర్యవసానం ఏమిటి..?
  • కాంగ్రెస్ లీడర్ల వ్యవహారంతో బిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు..
  • దేవరకొండ నియోజకవర్గంలో బాలు నాయక్ వర్సెస్ కిషన్ నాయక్..
  • సర్ది చెప్పలేక సతమతమైన బట్టి విక్రమార్క..
  • ఎవరు ఎలా ప్రవర్తిస్తుర్రో ప్రజలందరూ చూస్తున్నారు..
  • తక్షణమే క్రమశిక్షణ కమిటీ వారిపై చర్యలు తీసుకుంటుంది..
  • ఘాటుగా స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

కొండమల్లేపల్లి, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం కావడంతో.. గత కొన్ని ఏండ్లుగా వారి ఆధ్వర్యంలోనే పరిపాలన సాగించడం జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడిన అనంతరం ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. మొదటిలో ఇక్కడ వారిదే ఫైచేయగా ఉండేది. సర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూసి, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నా.. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో.. గతంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈసారైనా కాంగ్రెస్ జెండా దేవరకొండ ఖిల్లా మీద ఎగిరేయాలని ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దేవరకొండ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. గత రెండు రోజుల క్రితం పోలేపల్లి చౌరస్తా వద్ద గజమాలతో మొదలైన ఘర్షణ.. నేడు కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద స్టేజి మీదనే ఒకరిని ఒకరు దూషించుకోవడం, మైకులు గుంజుకోవడం, కొట్టుకునేంత స్థాయికి చేరడంతో పాదయాత్ర చూడడానికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కొనసాగితే మళ్లీ టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.. ఏదేమైనా బహిర్గతంగా కొట్టుకోవడం సిగ్గుచేటు అని కార్యకర్తలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.. ఈ ఘర్షణ జరుగుతున్న తరుణంలో అక్కడే ఉన్న బట్టి విక్రమార్క ఎంతో సర్ది చెప్పాలని ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో.. భట్టి మైకు తీసుకొని స్టేజి మీద జరుగుతున్న తతంగం కార్యకర్తలు, ప్రజలు చూస్తున్నారని.. తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకతో ఒకసారిగా కార్యకర్తలలో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది.. తన మాటలతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మళ్ళీ ఏదో విధంగా కొనసాగించడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు