- కామారెడ్డి, కొడంగ్‌లో తుక్కుగా ఓడిరచాలి
- రేవంత్, కాంగ్రెస్‌లను ఓడిస్తేనే దరిద్రం పోతది
- 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ది శూన్యం
- మంచినీరు, కరెంట్‌కు ఢోకా లేకుండా చేశాం
- ప్రజల చేతిలో విలువైన ఆయుధం ఓటు
- కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లు గోస పెట్టింది
- బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమే
- మహబూబ్‌నగర్, తాండూరు, కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
కొడంగల్ : రేవంత్ రెడ్డి లాంటి దొంగలతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతందని., ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు..పొయేద్ది లేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్, కాంగ్రెస్ లాంటి వారిని తరిమితే తప్ప దరిద్రం వదలదని అన్నారు. కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ టార్గెట్‌గా మండిపడ్డారు. కామారెడ్డిలో కూడా పోటీకి వచ్చాడని, అక్కడ తుక్కుతుక్కుగా ఓడిరచబోతున్నారని, ఇక్కడా ఓడిస్తేనే కొడంగల్ బాగుపడుతుందని అన్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు. ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ తుపాకీ పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా? అందుకే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రేవంత్ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని అన్నారు. కొడంగల్‌లో పనులన్నీ చేసి పెట్టే నరేందర్ రెడ్డి కావాలా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు కొడంగల్‌లో సరిపోలేదని.. కామారెడ్డిలో నాపై పోటీకి వస్తున్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో చిత్తుగా ఓడిరచాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు. అయినా కాంగ్రెస్ గెలిస్తే కదా.. రేవంత్ సీఎం అయ్యేది. రేవంత్ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్ పరిస్థితి మళ్లీ మొదటికే. ప్రజలు ఇవన్నీ గమనించాలి. కొడంగల్‌లో పనిచేసే నరేందర్ రెడ్డి కావాలా? వట్టిమాటలు చెప్పే రేవంత్ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలి. ఎమ్మెల్యేగా ఎవరుంటే కొడంగల్ గౌరవం పెరుగుతుందో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు అని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటు న్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదని.. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు అని ఎద్దేవా చేశారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో కొంటూ పట్టుబడ్డారని గుర్తు చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో చిత్తు చిత్తుగా ఓడిరచాలని కోరారు. ఎవరికి వారు నేనే సీఎం అని కాంగ్రెస్ లో దాదాపు 15 మంది తిరుగుతూ ఉంటారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కదా.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేదని అన్నారు.
మహబూబ్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటును కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. తాను మహబూబ్‌నగర్ నుంచే ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించామని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటును కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ తీసేస్తామని.. దాని స్థానంలో భూమేత తెస్తామని అంటున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. తాను మహబూబ్‌నగర్ నుంచే ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రజలు వివేకవంతులన్నారు. ఉద్యమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తే.. గెలిపించారని హర్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే విలువైన ఆయుధం ఓటు మాత్రమేనని తెలిపారు. ఓటువేసే ముందు అభ్యర్థితో పాటు వారి పార్టీ చరిత్రను కూడా చూడాలని ఓటర్లకు సూచించారు.
తాండూరు సభలో సీఎం కేసీఆర్
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఈ పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏం జరిగింది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో పోల్చిచూడాలన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేదు. తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. కానీ ఈ రోజు మిషన్ భగీరథతో ప్రతి తండాలో, చిన్న ఊరులో కూడా పరిశుద్ధమైన నీరును సరఫరా చేస్తోంది. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పాలనలో. పదేండ్ల కాలంలో మారుమూల తండాలకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాం అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ప్రజలంతా బతుకపోవుడు. అర్థరాత్రి కరెంట్ కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు షాకులతో, పాములు కరిచి చనిపోయారు. ఇవన్నీ మీరు ఆలోచించాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికనిపుణులతో చర్చించి ఒక లైన్ తీసుకున్నాం.పేదల సంక్షేమాన్ని ముందు తీసుకున్నాం. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేశాం. కంటి వెలుగు ద్వారా కండ్లద్దాలు పంపిణీ చేశారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలు అమలు చేశాం అని కేసీఆర్ తెలిపారు. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగం తీసుకున్నాం. వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతే ఇతర రాష్ట్రాల్లో పన్నులు వసూళ్లు చేస్తరు. మేం నీటి తిరువా రద్దు చేశాం. మేలైన విద్యుత్ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. అదృష్టం బాగాలేక రైతు ఎవరైనా చనిపోతే దినవారం లోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. 7500కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతులు బాగుండాలని మద్ధతు ధరకు కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.