Friday, April 26, 2024

హిజాజ్ పై నిషేధం ఎత్తివేత..

తప్పక చదవండి

బెంగుళూరు, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఆమెస్టీ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో మంత్రి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడుతూ తిరోగమించేలా ఉన్న ప్రతి ఉత్తర్వులు, బిల్లును సమీక్షిస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉండకూడదన్నారు. వ్యక్తి హక్కులను ఉల్లంఘించే, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులన్నింటినీ సమీక్షిస్తామని, అవసరమైతే తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు.
భజరంగ్‌దళ్‌ను సైతం నిషేధించాలనే చర్చ జరిగిందన్నారు. మతపరమైన, రాజకీయంగా, సామాజికంగా ఏదైనా సంస్థ సమాజంలో విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి సంస్థలతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. అది భజరంగ్‌దళ్‌ అయినా, పీఎఫ్‌ఐ అయినా, మరే సంస్థ అయినా కఠినంగా ఉంటామని, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తే నిషేధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

గతేడాది బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఒకే డ్రెస్ కోడ్‌ను పాఠశాలలు, కళాశాలల్లో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా.. ఆమ్నెస్టీ ఇండియా హిజాబ్‌పై నిషేధాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే కర్ణాటక ప్రివెన్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్ 2020ని, కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ బిల్ 2022ను సైతం తొలగించాలని డిమాండ్‌ చేశారు. అయితే, విద్యాసంస్థలో హిజాబ్‌ నిషేధం నిర్ణయాన్ని చాలా మంది సమర్థించగా.. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ రాజకీయాలు వేడెక్కనున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు