Saturday, April 27, 2024

నితీశ్‌ అవసరం మాకు లేదు

తప్పక చదవండి
  • బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి
  • మండిపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌

న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్‌ కుమార్‌ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్‌ తీసుకున్నారు’ అని భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా మొదటిసారి స్పందించారు. ‘నీతీశ్‌ ఎందుకు విపక్ష కూటమిని వీడారో తెలుసు. బిహార్‌లో కులగణన చేపట్టాలని మేం ఆయనకు స్పష్టంగా చెప్పాం. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు భాజపా భయపడిరది. ఆ పార్టీ దీనికి వ్యతిరేకం. నీతీశ్‌ ఇరుక్కుపోయారు. పారిపోవడానికి భాజపా ఆయనకు దారి చూపించింది. సామాజిక బాధ్యత అందించడం కూటమి బాధ్యత. దానికి నీతీశ్‌ అవసరం లేదు. కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన యూటర్న్‌ తీసుకుంటారు’ అని విమర్శిం చారు. 2020 శాసనసభ ఎన్నికల తర్వాత నీతీశ్‌ మూడోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మహాకూటమి, విపక్ష కూటమిలో కొన్ని విషయాలు నచ్చకపోవడం వల్లే భాజపాతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహార్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్‌.. భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ’ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అయితే, ’ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమిని వీడినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు