Sunday, May 19, 2024

సదరం క్యాంపుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి

తప్పక చదవండి
  • జిల్లా కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి

వికారాబాద్‌ : సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న అంగవైకల్యం గల దరఖాస్తుదారులు హాజరుకావాలని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ నెల 27, 30 వ తేదీల్లో వికారాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో ఆదాబ్‌ హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌ నిర్వహించే క్యాంపులకు హాజరుకా వాలని కలెక్టర్‌ తెలిపారు. ఇట్టి క్యాంపులకు గతం లో సదరం సర్టిఫికెట్‌ పొంది సర్టిఫికేట్‌ కాల పరిమితి దాటిన వారితో పాటు కొత్తగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు