Thursday, May 2, 2024

సీట్లు మార్చినంత మాత్రాన గెలవలేరు

తప్పక చదవండి
  • జగన్‌ సాహసాలు పార్టీని గెలిపించకపోవచ్చు
  • చంద్రబాబు, పవన్‌ కలయిక వారికి బలమే
  • ఎపిలో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు
  • మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు

రాజమండ్రి : రాజకీయాల్లో జగన్‌కు అంత అనుభవం లేదని సీట్లు మార్చే పక్రియ సరికాదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదు.. అధికారం అంతా జగన్‌ మోహన్‌ రెడ్డి, వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే గొప్ప ప్రయోగం చేశాని సెటైర్‌ వేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు కలవడం కచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందని, తెలంగాణ ఎన్నికల ప్రభావం కచ్చితంగా కనపడుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారన్నారు. సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలన్నారు. అటువంటి అనుభవం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఉందని నేను అనుకోవడం లేదు. టికెట్లు మార్చే పక్రియ సరికాదు. టికెట్లు మార్చకపోతే అక్కడ కేసీఆర్‌ ఓడిపోయారు.. మార్చితే ఇక్కడ జగన్‌ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదని ఉండవల్లి అన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ అంటే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అమితమైన అభిమానం. అటువంటి నెహ్రూను విజయసాయి పార్లమెంట్లో తప్పుపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందుత్వం తగ్గుతుందని అనడం వాస్తవం కాదని ఉండవల్లి అన్నారు. జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి నిజాయితీగల పార్టీని నడపడం రాక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదని విశ్లేషించారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా భారీ వృక్షాలను నరికేస్తున్నారు.. వెంటనే దాన్ని ఆపాలి. మళ్లీ ఎటువంటి చెట్లు పెంచడం మన వల్ల కాదని అన్నారు. లోక్‌ సభలో 150 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సరిjైున పద్దతి కాదని ఉండవల్లి అన్నారు. పార్లమెంట్‌ లో ప్రవేశించిన దుండగుడికి ఆ పాసులు ఇచ్చిన ఎంపీని ఇప్పటిదాకా విచారించలేదు. ఇంత మందిని సస్పెండ్‌ చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లేదని ఉండవల్లి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు