Wednesday, May 22, 2024

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

తప్పక చదవండి
  • ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..?
  • కాంగ్రెస్ పంచన ‘కడియం శ్రీహ‌రి’
  • మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్
  • నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ
  • ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం
  • పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి
  • శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం
  • మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్
  • వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం పాగా

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కడియం శ్రీహరి నెం.1 అని చెప్పాలి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ కట్టిన ఘనత సాధించాడు. వరంగల్ జిల్లాకు చెందిన 72 ఏళ్ల రాజకీయ కురువృద్దుడు కడియం శ్రీహరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన కడియం శ్రీహరి ప్రస్తుతానికి మూడు పార్టీలు మారాడు. తొలుత అన్నగారి పిలుపుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేబినెట్ లో స్థానం సంపాదించాడు. నెక్స్ట్ టిడిపి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుతో అంటకాగాడు. తెలుగుదేశం పార్టీలో ఉండి 26 సంవత్సరాలు పలు పదవులు అనుభవించాడు. తదనంతరం తెలంగాణ ఏర్పాటుకు ముందు టీఆర్ఎస్ జాయిన్ లో అయి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కీలక పదవి అప్పగించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను యూస్ చేసుకున్న రాజకీయ అపరమేధావి కడియం శ్రీహరి. అన్నం పెట్టినోడికే సున్నం పెట్టడం అంటే ఇదే కాబోలు.

తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మహానుభావుడు కడియం. ఆయనకు రాజకీయ బిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్. టీడీపీ ద్వారా 1987లో రాజకీయాల్లోకి వచ్చి 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసన సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు, 2సార్లు మంత్రిని చేసిన తెలుగుదేశం పార్టీని కడియం విచ్చలవిడిగా వాడుకున్నాడు. నారా చంద్రబాబు సైతం ఆయనకు కీలకమైన మంత్రి పదవులు అప్పజెప్పారు. కొంత కాలం తర్వాత 2013లో టీఆర్ఎస్ కండువా కప్పుకొని వరంగల్ ఎంపీ, 2015లో ఎమ్మెల్సీ, 2023లో శాసనసభ్యుడిగా ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్ కు పంగనామాలు పెట్టాడు. పదేళ్లు కారు గుర్తు పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో అన్ని అనుభవించాడు. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోవడం మేగాక పార్టీ పతార తగ్గడంతో కడియం కారు దిగాడు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా, తన బిడ్డకు వరంగల్ ఎంపీ కోసం ఆ పార్టీ జెండా కప్పుకొని అధికార పార్టీల పంచన చేరడంలో సిద్ధహస్తుడని ఫ్రూవ్ చేసుకున్నాడు.

- Advertisement -

టీడీపీతో మొదలు కాంగ్రెస్ వరకు
‘బరితెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు’ పెద్ద పెద్ద హేమా హేమీల కొంపమొంచిన ఘనత శ్రీహరిది. 1994లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం నాడు అన్నగారి మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన గవర్నమెంట్ లో కూడా విద్యా, నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేశారు. 2013 వరకు టీడీపీలో కొనసాగి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయినంక పదేళ్లు అనేక పదవులు అనుభవించాడు. ఓసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చిన గులాబీ పార్టీని నట్టేట ముంచి తన స్వలాభం కోసం హస్తం గూటికి చేరాడు. కడియం కావ్యకు తెరాస ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికి దాన్ని తిరస్కరించి తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.

మాదిగ పేరుతో అణిచివేత
ఎస్సీ మాదిగ ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ఎందర్నో రాజకీయంగా దెబ్బతీశాడు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు దొరల సొమ్ము దొంగల పాలు అన్నట్టు కడియం వ్యవహారం ఉన్నది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వంటి మరెందర్నో రాజకీయాల్లో తొక్కేశాడని ప్రచారం అవుతుంది. మాదిగ కులానికి చెందిన వారిని సైతం ఎవర్నీ లెక్కచేయకుండా శ్రీహరి ఒంటెద్దు పోకడతో పోయాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించినప్పటికి ఎస్సీలను కనీసం దగ్గరకు రానీయ్యలేదని టాక్. దళితుల అభివృద్ధికి పాటుపడకపోవడమే కాకుండా, వాళ్ల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదని కడియంపై ఎస్సీలు మండిపడున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నంత మాత్రాన ఆయన భవిష్యత్ మారిపోతుందని అనుకుంటే పొరపాటే. మనం అంగీలు మార్చినంత ఈజీగా పార్టీ జెండాలు మార్చిన కడియం శ్రీహరి రాజకీయ జీవితం ఇప్పుడు ఏంటన్నదీ స్టేషన్ ఘన్ పూర్ వాసులే డిసైడ్ చేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు