Saturday, April 27, 2024

పఠాన్ చెరులో ఎవరి బలాబలాలేంత..?

తప్పక చదవండి

( ఆసక్తిని రేపుతున్న పఠాన్ చెరు రాజకీయం)

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నీలం మధు ముదిరాజ్ ఓ వైపు..
  • బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నందీశ్వర్ గౌడ్..
  • మరో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్..
  • బీఆర్ఎస్ పార్టీ నుండి మహిపాల్ రెడ్డి
  • ఎవరు బలమైన కాండిడేట్, ఎవరు బలహీనమైన కాండిడేట్..
  • ఆదాబ్ హైదరాబాద్ విశ్లేషణలో ఆసక్తికర విశేషాలు..

అన్ని పార్టీలు దాదాపుగా తమ తమ అభ్యర్థులను ప్రకటించేశారు.. పఠాన్ చెరు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.. బీ.ఆర్.ఎస్ నుండి మహిపాల్ రెడ్డి, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్, ఇక కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్.. ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్న విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీనుంచే మరో నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓట్లు చీల నున్నాయా..? లేక అధిష్టానం ఆదేశానుసారం కలిసి పనిచేస్తారా..? ఎవరి బాలా బలాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏవిధంగా పార్టీకి లాభాన్ని చేకూర్చనున్నాయి..? ఎలాంటి నష్టం వాటిల్లబోతోంది..? ఒక సారి విశేషిస్తే….

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ :
ఈయనకు వున్న బలం ఎంత..?

  1. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం..
  2. వార్డ్ మెంబర్, ఉపసర్పంచ్, సర్పంచ్, అమ్మగారు నీలం రాధారెడ్డి ఎంపిటిసిగా పనిచేయడం.
  3. పటాన్చెరు నియోజకవర్గంలో గల ప్రతి గ్రామంలో ఎన్ఎమ్ఆర్ యువసేన పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ఉపాధి కల్పించడం, వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం, పేదవారి చదువుల కొరకు సహాయం, పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సహాయం చేయడం, తాగునీటి లేని ప్రదేశంలో వాటర్ ట్యాంకర్లు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం, నిరుపేదలైన వారికి దహన సంస్కార్లకు సహాయం చేస్తూ, టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా సుమారు 50వేల మంది ఎంఎంఆర్ యువసేన కార్యకర్తలు ఉండడం వారితో నియోజవర్గం అంత సేవా కార్యక్రమాలు చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండటం నీలం మధు సొంతం.
  4. ఎమ్మెల్యేగా గెలిస్తే దందాలు చేయడానికి, కుటుంబంలో రౌడీయిజం, దాదాగిరీలు, కబ్జాలు చేసే వాళ్లే లేరు.
  5. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఎన్ ఎం ఆర్ యువసేన నే ఆయన బలం.
  6. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధుల బలం, ఎన్.ఎం.ఆర్ యువసేన కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఓసి,సంపండ వర్గాల ప్రజలు అభిమానులు ఉండటం బలం.
  7. నీలం మధు సంపాదన, మంచితనం మానవత్వం, అందరిని కలుపుకుపోయే గుణం, ముఖ్యంగా అత్యధిక జనాభా గల ముదిరాజ్ ఓట్స్ బిసి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మనసులో స్థానం సంపాదించడం.
  8. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న 60 లక్షల ముదిరాజుల ఓట్లు అత్యధికంగా పడే అవకాశం ఉంది.
  9. చిటికలు గ్రామపంచాయతీని అభివృద్ధి బాటలో పరిగెత్తించడం. బలహీనతలు :
  10. నీలం మధు వెంట ఎవరు ప్రజాప్రతినిధులు లేరు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం.
  11. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవకపోవడం.
    3.పటాన్చెరులో ఉన్న చోట మోటా లీడర్లను డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మహిపాల్ రెడ్డి నేను ఎమ్మెల్యేను నన్ను ఎవరు ఏం చేస్తారులే అని మేకపోతు గాంబిర్యం ప్రదర్శించడం.
  12. స్థానిక లీడర్లను మధు దగ్గరికి వెళ్లకుండా కట్టడి చేయడం.
  13. మహిపాల్ రెడ్డి వెంబడి తిరిగే ప్రతి లీడర్ కు తెలుసు, ఎవరు మంచివారు, ఎవరు అహంకారంతోనే ఉంటారో.

బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నందీశ్వర్ గౌడ్.
ఈయన బలము ఎంత..?

  1. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా గెలవడం.
  2. బిజెపి పార్టీ కార్యకర్తలు అతని బలం.
  3. ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసినప్పటి పరిచయాలు.
  4. మహిపాల్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ ఒకరికొకరు సహాయ సహకారాలు ఉండొచ్చు.

బలహీనతలు :

  1. ప్రజలలో లేకపోవడం.
  2. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి పార్టీ పైన నమ్మకం లేకపోవడం.

కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ :


బలం ఎంత.

  1. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం.
  2. అమీన్పూర్ సర్పంచ్ గా పనిచేయడం.
  3. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతని బలం.

బలహీనతలు.
1.అమీన్పూర్ సర్పంచ్ గా ఉన్నప్పుడు కేసులు ఎదుర్కోవడం చెక్ పవర్ రద్దుకవ్వడం.

  1. కబ్జాలు చేశారని ఆరోపణలు రావడం
  2. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం
  3. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం
  4. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప అతని కంటూ సొంత కార్యకర్తలు లేకపోవడం.
  5. గత ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం.

పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి

బలం ఎంత.,

  1. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం.
  2. స్థానిక ఎమ్మెల్యే కావడం
  3. బలంగా సంపాదించడం
  4. నియోజవర్గంలో కీలకం
    5.పోస్టుల్లో రెడ్డిలను పెట్టుకొని బీసీ నాయకులను ఎదగకుండా చేయడం
  5. కుటుంబంలో తమ్ముడు కొడుకులు, బామ్మర్దులు, సడ్డకులు అల్లుళ్ళు.
  6. నేను సేవ చేసిన ప్రజలలో ఉన్న పటాన్చెరు అభివృద్ధి చేసిన అని చెప్పడం,
  7. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి బరాబర్ చేయాలి ప్రజలు జీతం ఇస్తున్నావు కదా, ఎమ్మెల్యేగా లేనప్పుడు పటాన్చెరు సేవ కార్యక్రమాలు చేసినవా చేయలేదు కదా. బలహీనతలు.
  8. టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత
  9. గూడెం మహిపాల్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత
  10. బంధుమిత్రులతో కబ్జాలు దండాలు.
  11. బెదిరింపులు
  12. తెలంగాణ ఉద్యమ ద్రోహి
  13. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గౌరవించకపోవడం
  14. ఆయన గెలిస్తే బామ్మర్దులు సడ్డకుడు కొడుకులు, తమ్ముడు అందరూ దందాలు దిగుతారు
    8.ముఖ్యంగా కుటుంబ పరిపాలన చేస్తూ పటాన్చెరు అరాచకం సృష్టిస్తారు.
  15. ఒకటి ముఖ్యంగా పటాన్చెరు అభివృద్ధి చేసినమని చెప్తున్నారు కదా 9 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే ఉన్న బరాబర్ చేయాల్సిందే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిక్, కంపల్సరీ చేయాల్సిందే, కానీ పనిచేయలే.
    10.ఇప్పటికి కాలనీలలో,విలేజ్ లో పూరి గుడిసెలు, రోడ్స్ సరిగా లేవు, డ్రైనేజీ సరిగా, కరెంటు సమస్య పింఛన్లు రేషన్ కార్డులు ఇప్పించలేదు,తాగునీరు ఇవ్వకపోవడం
    11.ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు ఈఎస్ఐ హాస్పిటల్ లో డాక్టర్స్ లేరు మందులు లేవు, పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా అంతే.
  16. ఎమర్జెన్సీగా హార్ట్ ఎటాక్,యాక్సిడెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పేదవారికి వైద్యం చేయించుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి, పైసలు ఉన్నవాడుబతుకుతాడు. పైసలు లేనివాడు పరలోకానికే.
  17. మల్ల టిఆర్ఎస్ గెలిచిన, గూడెం మహిపాల్ రెడ్డి గెలిచిన, రైతులకు, వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా కార్మికులకు భద్రత ఉండదు.

దీనిని బట్టి ప్రజలే నిర్ణయించాల్సి ఉంటుంది.. ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారు అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు