Sunday, May 19, 2024

అధిక రక్తపోటుపై రిపోర్టు ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హైబీపీతో బాధపడుతన్న వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్టును రిలీజ్‌ చేసింది. హైబీపీతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ఆయా దేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట్ల మందిని బ్రతికించుకోవచ్చు అని పేర్కొన్నది. ఇండియాలో ఎక్కువ శాతం మరణాలకు హై బీపీనే ముఖ్య కారణమని రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు వయోజనుల్లో.. ఒకరికి హైపర్‌టెన్షన్‌ సోకుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. హైబీపీ వల్ల స్టోక్ర్‌, హార్ట్‌ అటాక్‌, హృద్రోగ సమస్యలు, కిడ్నీ డ్యామేజ్‌ లాంటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. 140/90 ఎఎఐస్త్ర లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో బీపీ ఉన్న వ్యక్తులు 1990 నుంచి 2019 వరకు రెండిరతలు పెరిగినట్లు రిపోర్టులో వెల్లడిరచారు. ఈ సంఖ్య 65 కోట్ల నుంచి 103 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బీపీతో ఉన్న సగం మందికి తమ ప్రస్తుత పరిస్థితి తెలియదన్నారు. వృద్దాప్యం, జన్యు సమస్యలు ఉన్నవారిలో మరింత అధిక రక్తపోటు ఉంటుంది. బలవర్దకమైన ఆహారం తీసుకుని, పొగాకును మానేస్తే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. యాక్టివ్‌గా ఉండడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. గుండెపోటు వల్ల ప్రతి గంటకు వెయ్యి మంది మరణిస్తున్నారని డాక్టర్‌ టామ్‌ ప్రైడెన్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు