Monday, April 29, 2024

సర్ ప్లేస్ సీలింగ్ భూమిని మింగిన పెద్దలు ఎవరు..?

తప్పక చదవండి
  • చర్లపల్లి సర్వే నెంబర్ 70లో ప్రభుత్వ భూ కుంభకోణం..
  • నకిలీ ఎల్ఆర్ఎస్ లతో భవన నిర్మాణ అనుమతులు..
  • చర్లపల్లి సర్వే నెంబర్ 70లో 6.19 గుంటలు మాయం..
  • ప్రభుత్వ రికార్డుల్లో సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్…
  • సీలింగ్ లాండ్ కాస్త పట్టాగా మారిన వైనం….
    ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులు తలుచుకుంటే రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారుతున్న వైనం తెలంగాణలో నిత్యకృత్యమైంది. ఈ అక్రమాలను నిలువరించేవారు లేకపోవడంతో కబ్జాదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.. సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ కాస్తా పట్టా భూమిగా మారిన వింత సంఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కాప్రా మండల చర్లపల్లి డివిజన్ లోని సర్వే నెంబర్ 70లోని సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ కాస్తా పట్టా భూమిగా మారి బహుళ అంతస్తుల కాలనీగా మారిపోయింది. చర్లపల్లి డివిజన్ లోని ఓల్డ్ చర్లపల్లిలో 2002లో లేఔట్ ఏర్పాటు చేసి, సర్ ప్లేస్ సీలింగ్ ల్యాండ్ సైతం కలుపుకొని అక్రమార్కులు ఫ్లాట్లుగా విక్రయించారు. అమాయకుల అవసరాలను ఆసరా వేసుకున్న రియాల్టర్లు 2018లో అక్రమ ఎల్ఆర్ఎస్ సృష్టించి భవన నిర్మాణాలకు అనుమతులను పొందారు. రెవెన్యూ అధికారులు పూర్తి నిర్లక్ష్యం కారణంగానే చర్లపల్లి సర్వే నెంబర్ 70 సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ పూర్తిగా అన్యాక్రాంతమైంది. 2018 లోనే కాప్రా మున్సిపల్ అధికారులు, ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులకు గజం జాగా దొరకని నగర శివారు ప్రాంతాల్లో.. ప్రభుత్వ భూములను ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో అక్రమ వెంచర్లుగా మారిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

కాప్రా మండల సర్వేయర్ వివరణ :
చర్లపల్లి డివిజన్ లో సర్వే నెంబర్ 70 లో 6.19 గుంటలు సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ ఉందని సర్వేయర్ అనిల్ వివరణ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై మాకు ఎలాంటి సమాచారం లేదని, కలెక్టర్ కార్యాలయంలో అర్బన్ సీలింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. చర్లపల్లి సర్వేనెంబర్ 70లో ఏలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా అర్బన్ సీలింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారి వివరణ :
కాప్రా మండల్, ఓల్డ్ చర్లపల్లి సర్వే నెంబర్ 70లో ఎలాంటి సర్ ప్లేస్ సీలింగ్ ల్యాండ్ లేదని.. లేఅవుట్ నిబంధనల ప్రకారమే అనుమతులు జారీ చేశామని.. టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్ సర్వేనెంబర్ 70లో ఉందని, మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అర్బన్ సీలింగ్ నుంచి ఫిర్యాదులు వస్తే అనుమతులను నిలిపివేస్తామని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు