Thursday, October 10, 2024
spot_img

టి.ఎస్.పీ.ఎస్.సి. పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

తప్పక చదవండి
  • మొత్తం 99 కి చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య..
  • నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టుల పర్వం..
  • మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కు సహకరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాజా మూడు అరెస్ట్‌లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది. ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్.. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల త్వరలోనే 100 దాటనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాజశేఖర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు