Tuesday, May 21, 2024

డబ్బులు ఇస్తేనే ఎంబీలపై సంతకాలు పెడతాం

తప్పక చదవండి
  • బాజాప్తా బల్లగుద్ది చెబుతున్న అధికారులు..
  • పీర్జాదిగూడ ఇంజనీరింగ్‌లో అవినీతి తిమింగలాలు..
  • ప్రతి అభివృద్ధి పనులకు పర్సంటేజీల పంపకాలు..
  • చక్రం తిప్పుతున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌..

హైదరాబాద్‌ : ప్రభుత్వంలో పర్మినెంట్‌ లేదా కాంట్రాక్ట్‌ బేసిస్‌ మీద పనిజేసే ఉద్యోగులు తాము తీసుకుంటున్న జీతానికి తగ్గట్టుగా విధి నిర్వహణ చేయాల్సి ఉంటుంది.. కానీ కొంతమంది ఉద్యోగులు జీతం కంటే పైసంపాదన మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.. తాము విధిగా చేయాల్సిన పనులకు సైతం లంచాలు అడుగుతూ తలవంపులు తెస్తున్నారు.. ఇలాంటి వైఖరి ఒకటి పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో వెలుగు చూసింది.. సిస్టం ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగి, తాను అడిగినంత లంచం ఇస్తేనే పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.. వివరాలు చూద్దాం..

పిర్జాదిగూడ మున్సిపాల్‌ కార్పొరేషన్‌ లో ప్రతి అభివృద్ధి పనులకు పర్సంటేజీలు చొప్పున పంపకాలు చేసుకుంటూ.. నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, అభివృద్ధిపరచే దిశగా ప్రణాళికలు చేస్తుంటే అందుకు భిన్నంగా పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవినీతికి కేంద్ర బిందువుగా మారిపోయింది. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ పాటించిన దాఖలాలు లేవు. పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఇంజనీరింగ్‌ అధికారులకు అనుకూలమైన కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని, కోట్లాది రూపాయల అభివృద్ధి సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కమ్యూనిటీ పార్కులు, వారాంతపు సంతల షెడ్ల పనులను కట్టబెట్టుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించక పోయినా కింద స్థాయి వర్క్‌ ఇన్స్పెక్టర్లకు, ఇంజనీరింగ్‌ అధికారులు తగిన పర్సెంటేజ్‌ ఇస్తే పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

డబ్బులు ఇస్తేనే ఎంబీలపై సంతకాలు :
పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో అభివృద్ధి పనులకు పర్సంటేజీలు కేటాయించి ఇంజనీరింగ్‌ అధికారులు సంతకాలు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కు 5శాతం, డిప్యూటీ ఇంజనీర్‌ కు 2శాతం, కమిషనర్‌ కు 2శాతం, అకౌంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కు 1.5 శాతం చొప్పున పర్సంటేజీలు ఇస్తేనే రాత్రికి రాత్రి ఎంబీలపై సంతకాలు పెడుతున్నారని ఆరోపణ లేకపోలేదు.

చక్రం తిప్పుతున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ :
ఇంజనీరింగ్‌ అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్యన ఆ విభాగంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ మధ్యవర్తిగా వ్యవహరించి పర్సంటేజ్‌ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో ఎలాంటి అభివృద్ధి పనులు కావాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్‌ కు విరుద్ధంగా ఏ కాంట్రాక్టర్‌ ఎక్కువ పర్సంటేజ్‌ ఇస్తారో ఆ కాంట్రాక్టర్‌ కే లక్షలాది రూపాయల పనులను అప్పచెబుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కంప్యూటర్‌ ఆపరేటర్‌ గా వ్యవహరిస్తున్న వ్యక్తే కీలక భూమిక పోషిస్తూ అవినీతికి ఆజ్యం పోస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు