Saturday, July 27, 2024

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్నాం..

తప్పక చదవండి
  • అవగాహన కల్పించేలా ఇంటింటికి ప్రచారం..
  • పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు
  • జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ : నిరుపేదకు కార్పోరేట్‌ వైద్య సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పై రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. ‘‘వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ’’ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందటం ఎలా’’ కర పత్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద బలహీన వర్గాల వారికి నాణ్యతతో కూడిన మెరుగైన కార్పోరేట్‌ వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో డా. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 49 ప్రైవేట్‌ కార్పోరేట్‌ ఆసుపత్రులతో పాటు గ్రామీణ పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జనరల్‌ ఆసుపత్రులలో 3,257 వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు వైద్య సహాయం పొందెందుకు ఆసుపత్రులో ప్రవేశించి ఆరోగ్య మిత్రను కలిసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నుండి డాక్టర్‌, నర్సింగ్‌ సేవలు, వైద్య పరీక్షలు, ఉచిత పరీక్షలు, శస్త్రచికిత్సలు, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలను వినియోగించుకోవడంతో పాటు చికిత్స అనంతరం తిరిగి ఇంటికి చేరే వరకు అయ్యే ఖర్చును, ఆరోగ్య ఆసరా సేవలకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందనే సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద పొందిన చికిత్సలు నిర్వహించిన వైద్య పరీక్షలు, ప్రభుత్వం ద్వారా నెట్‌ వర్క్‌ ఆసుపత్రికి జమ చేసిన మొత్తం వివరాలను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ యాప్‌ ద్వారా పొందుపరిచిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చుననే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం సేవలు సంతృప్తి కరంగా లేకపోతే 104 ద్వారా ఫిర్యాధు చేసి తక్షణమే పరిష్కరించుకునే అవకాశంపై, ఆసుపత్రులలో ఆరోగ్యమిత్ర గాని, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గాని డబ్బులు అడిగితే 14400 నెంబర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్న సమాచారాన్ని కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. కరపత్రం విడుదల కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డియంఅండ్‌ హెచ్‌వో డా. యం సుహాసిని, డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కో`ఆర్డినేట్‌ జె. సుమన్‌, కనకదుర్గఅమ్మవారి దేవస్థానం ఈఓ రామరావు, టీమ్‌ లీడర్లు టి. రవి కుమార్‌, ఐ ఆశ్విని, పి. శివరామప్రసాద్‌, సిహెచ్‌ శ్యామ్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు