Saturday, July 27, 2024

భవిష్యత్తుకు బంగారు బాటవేస్తాం

తప్పక చదవండి
  • మనోధైర్యంతో ఉండండి…
  • జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు.

విజయవాడ : తల్లిదండ్రులను కోల్పోయిన మీరు ఆనాధులు కారని మీ అందరుకు మేము అండగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తామని మనోధైర్యంతో ముందుకు వెళ్లి ఉన్నత విద్యాను అభ్యసించి ఉపాధి అవకాశాలను అందుకోవడం ద్వారా సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేందుకు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆనాధ చిన్నారులకు భరోసా అందించారు.ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోగల వాసవ్య మహిళా మండలి నందు శుక్రవారం ఆనాధుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహారం వింధులో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పాల్గొన్ని చిన్నారులతో మమేకమైయ్యారు. చిన్నారులు తమ కుటుంబం గురించి చెప్పిన కొన్ని మాటలకు కలెక్టర్‌ చలించి పోయారు. బాలలతో ముచ్చటిస్తూ తల్లిదండ్రుల వివరాలు విద్యా వసతి గురించి అడిగి తెలుసుకుని మీరు ఆనాధులు కారని మేమందరం మీకు తల్లిదండ్రులమని మీ అలాన పాలన చూడవలసిన భాధ్యత మా పై ఉందన్నారు. మీరు మనోధైర్యంతో ముందడుగు వేసి మంచి విద్యాబుద్దులు నేర్చుకుని ఉన్నత చదువులు చదివితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేదని సమాజంలో అందరితో సమానంగా జీవించవచ్చునని చెబుతూ వారికి జీవితంపై భరోసా కల్పిస్తు మనోధైర్యాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లైగింక జీవితంలో కొందరు తాత్కాలిక సుఖానికి లోనై అడ్డదారులు తొక్కడం ద్వారా ఎయిడ్స్‌ వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారన్నారు. తద్వారా వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాక ప్రాణాలు కోల్పోయి బిడ్డలను ఆనాధులను చేయడం దురదృష్టకరమన్నారు. ఎయిడ్స్‌ మహమ్మారిని సమూలంగా రూపుమాపి ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 17 వేల మంది ఎయిడ్స్‌ వ్యాధికి గురి అయిన్నట్లు నివేధికలు తెలియజేస్తున్నాయన్నారు. సమాజానికి బయపడి కొంత మంది వ్యాధిగ్రస్తులు చికిత్స చేయించుకోవడంలేదన్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారు పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన మందులను పౌష్టికాహారాన్ని తీసుకుని వ్యాధిని నివారించుకోగలుగుతారన్నారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పించి కండోమ్స్‌ వాడకంపై చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు చేస్తున్న విస్తృతంగా ప్రచార కారణంగా ఎయిడ్స్‌ వ్యాది పట్ల అవగాహన పెరిగిందని, తద్వారా ఎయిడ్స్‌ వ్యాధి బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. మనం సమాజం నుంచి ఎయిడ్స్‌ వ్యాధిని దూరం చేయాలే తప్ప వ్యాధిగ్రస్తులను కాదన్నారు. ఎయిడ్స్‌ వ్యాధికి గురైనా వారి చిన్నారులను వాసవ్య మహిళా మండలి ఆక్కున చేర్చుకుని ఆదరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సంతోషంగా జీవించేందుకు ఎటువంటి అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని చిన్నారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు చిన్నారులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. వాసవ్వ మహిళ మండలి కార్యదర్శి డా. జి రష్మి మాట్లాడుతూ ఆనాధ పిల్లలను చేరదీసి సంరక్షించే భాధ్యతను 2003 సంవత్సరంలో చేపట్టడం జరిగిందని 2006 సంవత్సరంలో బిల్‌ క్లింటన్‌ పౌండెషన్‌ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు 2,500లకు పైగా ఆనాధ పిల్లలను చేరదీసి వసతి, భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ఉన్నత విద్యాను అందించామని, తద్వారా అనేక మంది ఉద్యోగాలు అవకాశాలు పొందారన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడిన వారికి ఉచిత మందులను, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం 80 మంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డా. జి. సమరం, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. బి కీర్తి, కార్యదర్శి జి. రష్మి, మెడికల్‌ డైరెక్టర్‌ డా.పి. దీక్ష, గోర సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జి. నియంత, ఎమిక్యూర్‌ ఫార్మా లిమిటెడ్‌ ప్రతినిధి మల్లికార్జునరావు, వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు