Saturday, July 27, 2024

వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్

తప్పక చదవండి
  • డ్రెస్సింగ్ రూంలో వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మార్ష్
  • మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు.. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా
  • కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్
  • భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్

భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే డ్రెస్సింగ్ రూంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా… మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై మిచెల్ మార్ష్ స్పందించాడు. తానేమీ వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ పై మళ్లీ కాళ్లు పెడతానని స్పష్టం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై తాను పెద్దగా ఆలోచించలేదని మార్ష్ వెల్లడించాడు. దీని గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందని, కానీ అందులో ఏముందని అంతలా మాట్లాడుకుంటున్నారని మార్ష్ ప్రశ్నించాడు.

‘‘గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా అహంకారంతో ఉండేవాళ్లు. ఈ వరల్డ్ కప్ గెలిచాక అది మరింత ఎక్కువైంది’’ అని డేవిడ్ వార్నర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చాడు. ‘‘ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరినైనా కలిశావా లేక కంప్యూటర్ కీబోర్డ్ నుంచి జాలువారిందా?’’ అని సరదాగా ప్రశ్నించారు. స్మైలీ ఎమోజీలను జోడించాడు. వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు