Sunday, May 19, 2024

బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ..

తప్పక చదవండి
  • సాంప్రదాయ బద్దంగా సాగుతున్న బతుకమ్ము ఉత్సవం..
  • కాకతీయుల కాలం నుంచే అనాదిగా ఉద్యమగీతమై
    కళాత్మంగా ఆ తోమ్మిది రోజులు…!!

( సయ్యద్‌ హాజీ, ప్రత్యేక ప్రతినిధి )

హైదరాబాద్ : బతుకమ్మ వేడుక నగర వాసుల బతుకుల్లో భాగమైంది. ఆటకు పాటకు వేదికైంది. సంస్రృతీ సంప్రదాయాలకు ‘‘వెలుగు’’ల దీపమైంది. అన్నింటికి మించి ప్రతి నవ్యులోనూ తానో పువ్వై ‘‘వెలుగు ’’తోంది.. పట్టువస్త్రాలు ధరించిన మహిళలు.. కులం లేదు.. పేద ధనిక తేడా లేదు.. ఒకరినొకరు ఆనుకుని వంగుతూ.. లేస్తూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ ఒక్కోసారి వేగంగా ..మరోసారి నెమ్మదిగా కదులుతూ వలయాకారంగా.. మొగ్గ మాదిరి దగ్గరికి వస్తూ వువ్యు విచ్చుకున్నట్లుగా వెనుకకు అడుగులు వేస్తూ.. ఒకరు పాట పాడుతుంటే… కోరస్ గా మిగతా వాళ్లంతా దాన్ని తిరిగి పాడుతూ… బతుకమ్మ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ దృశ్యం మనోహారంగా చూపరులను ఆహ్లాదం కలిగిస్తుంది. వినేకోద్దీ ఆ పాటలు వినబద్దవుతుంది. ఇలాంటి వేడుక మన తెలంగాణకే ప్రత్యేకం.. అందునా ఈ వేడుక చివరి రోజులైన సద్దుల బతుకమ్మను భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించడం ఆనాయితీగా మారింది. తెలంగాణ ఏర్పడ్డాక అధికారిక పండుగగా బతుకమ్మను గుర్తించారు. గతంలో ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ బతుకమ్మ వేడుకను ప్రపంచ మొత్తం ఇటువైపు దృష్టి సారించేలా నిర్వహించారు..

- Advertisement -

కాకతీయులకాలంనుంచే..!! తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజు గుండన కాలంలో పోలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ మూర్తి దేవతా విగ్రహాం లభించింది. గుమ్మడి తోటలో లభించినందువల్ల దానికి సంస్కృత పేరైనా ‘కాకతమ్మ ’అంటూ రాజులు ఆ దేవతను పూచించడం మొదలుపెట్టారట.. రాజు వంశమే కాదు ఆ ప్రాంతం ప్రజలూ పూజలు చేయడం మొదలెట్టారు. రాను రాను విగ్రహం కన్నా దాని ముందు పూల కుప్పే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాలక్రమంలో కాకతమ్మ శబ్ధం కాస్తా బతుకమ్మగా మారి వుండొచ్చనేది పరిశోధకుల మాట. కాకతీయుల సేనాని జాయప సేనాని రచించిన నృత్యారత్నావళిలోని ఒక చిందు… .బతుకమ్మ ఆటకు మూలమని పరిశోధకుల అభిప్రాయం ఇవే కాదు..చాలారకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి..

అనాదీగా.. బతుకమ్మ పాటల్లో స్త్రీల కష్టాలు ..కన్నీళ్లు..సామాజిక స్థితిగతులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆటలో అన్నింటిని మరిచి పోయినట్లే … కష్టాలకు దూరంగా అందరినీ బతుకమనీ.. అందరికీ మంచి బతుకునివ్వమని సామూహికంగా కోరుకునే గొప్ప ఉత్సవంగా ఈ పండగను సాహితి ప్రియులు అభివర్ణిస్తున్నారు. నగరంలో వాడవాడలా బతుకమ్మలు అడుతుంటారు. దీనికి ఉదాహరణ అంబర్పేట లో బతకమ్మ పేరుతోనే కుంట ఉండటం ఇక్కడ బతుకమ్మలు నిర్వహిస్తారనేందుకు చారిత్రక ఆధారం.. కాలా క్రమేణా కుంట కనుమరుగైంది ఆట పక్కకు పోయింది. ఒక చోట ఆడకపోతేనేం మరోచోట మొదలైంది. కొన్నేళ్లుగా బతుకమ్మను కూకట్ పల్లిలో వైభవంగా నిర్వహిస్తు వస్తున్నారు..

ఉద్యమ గీతమై.. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బతుకమ్మ పోరు గీతమైంది. భాగ్యనగరం మొత్తం పాకింది. ఉళ్లలో కాదు.. ఉంటున్న చోటే బతుకమ్మ ఆడాలనే స్పృహ పెరిగింది. వేడుకల వేళ సాయంత్రం కాగానే మహిళలు.. యువతులు… చిన్నారులు.. ఒక చోట బతుకమ్మలు చేరి ఆటడం తిరిగి ప్రారంభించారు. ఆరోజుల్లో ఏ గల్లీలో విన్నా ఇవే పాటలు మార్మోగుతుంటాయి. నగరంలో ఎక్కువగా దాండియా, గర్భా నృత్యాలు కనిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ప్రచారం పొందుతుంటాయి. ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. బతుకమ్మను మన వారే కాదు నగరంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు బతుకమ్మ ఆడుతుంటం విశేషం..

ఆ తోమ్మిది రోజులు.. బతుకమ్మ ముందు తోమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజిస్తారు. చెక్కపీట మీద పుట్టమన్నుతో తయారు చేసి పూలతో ఆలంకరించిన బొడ్డెమ్మ గౌరమ్మ రూపమే.. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్న ఇంట్లో బొడ్డెమ్మను పెడతారు. కన్నెపిల్లలు ఈ గౌరమ్మను ఆరాధిస్తారు. ఆనవాయితీ లేని ఇళ్లోని ఆడపిల్లలు ఇరుగు పొరుగు వారి నివాసాలకు వెళ్లి బొడ్డెమ్మలను కొలిచి వస్తారు. ప్రతిరోజు ఆటపాటలతో బొడ్డెమ్మను కొలుస్తారు.. నిద్రపో బొడ్డెమ్మా.. నిద్రపోవమ్మా నిద్రకూ నూరెళ్లు… నీకు వెయ్యేళ్లు అని పాడుతూ నిద్రపుచ్చుతారు..!!

ఒక్కోరోజు ఇలా.. 9 డేస్..

  1. మొదటిరోజు..ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు.. ఆరోజు తులసి ఆకులు, వక్కలు ప్రసాదంగా తీసుకుంటారు. ఆరోజు బతుకమ్మను తులసి చెట్టు దగ్గర పెడతారు..
  2. రెండోరోజు..ఆటుకుల బతుకమ్మ ..,చప్పిడిపప్పు బెల్లం ఆటుకులు ఇస్తారు…
  3. మూడోరోజు. ముద్దపప్పు బతుకమ్మ ..ముద్దపప్పు బెల్లంపాలు ఇస్తారు…
  4. నాలుగో రోజు.. నానబియ్యం.బతుకమ్మ. నానేసిన బియ్యం పాలు బెల్లం…
  5. ఐదోరోజు. ఆట్ల బతుకమ్మ…ఆట్లు ప్రసాదంగా ఇస్తారు. రెండు నుంచి ఐదోరోజు వరకు అందరూ కలిసి ఆడుతారు..
  6. ఆరోరోజు.. అలిగిన బతుకమ్మ ..ఆర్రేం అంటే సేలవని ఆ రోజున బతుకమ్మ ఆడరు..
  7. ఏడోరోజు.. మాసరాకుల వేపకాయల బతుకమ్మ.. సకినాల పిండిని వేపకాయల్లా చేసి నూనె లో వేయిస్తారు..
  8. ఎనిమిదో రోజు.. వెన్నముద్దల బతుకమ్మ ..నవ్వులు వెన్న ముద్ద బెల్లి….
  9. తోమ్మిదో రోజు… సద్దుల బతుకమ్మ ..పెద్ద బతుకమ్మ పెరుగన్నం.. చిత్రాన్నం.. కొబ్బరిపోడి.. నువ్యుపోడి… ఇలా ఇదు రకాల సద్దులతో నైవైద్యం చేస్తారు..

తృణధాన్యాలతో ఫలహారం :
సద్దుల బతుకమ్మ రోజు పంచే ఫలహారం ముఖ్యంగా ఆడపిల్లలుకు ఉపయోగపడేలా తయారుచేస్తారు. బతుకమ్మతో పాటే వివిధ రకాల ఫలహారాలను చెరువు దగ్గరికి తెచ్చి పంచిపెడుతారు. సత్తుపిండి, పల్లీ ముద్దలు, సజ్జపిండి, పంచుతారు. సజ్జలు, బెల్లం, నెయ్యి కలిపి చేసిన పిండి ముద్దలు మహిళల రక్తహీనతను తొలగిస్తాయి. పళ్లీ ముద్దలు పిల్లలకు బలవర్దక మైన ఫలహారం. సత్తుపిండిగా పిలిచే పీచుపదర్ధాం వల్ల మలబద్దకం తగ్గుతుంది. అప్పట్లో ఫలహారాలు ఆరోగ్యాన్ని కాపాడేలా ఉండేవి..

కళాత్మకంగా పేర్చడం :
బతుకమ్మను పేర్చడం ఒక కళ.. రంగురంగుల పూలు.. రకరకాల పూలు.. అంతస్థులుగా పేర్పులో అందం కూర్పులో నేర్పు ఉంటాయి..
తంగేడు..బంతి..గునుగు.గుమ్మడి.. పూలు తీగమల్లే మంకేనా పువ్యు, ఛత్రిపువ్యు, గులాబీ, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, సలిమల్లే పాటూ సీజన్లో దోరికే తీరోక్కపూలతో పేరుస్తుంటారు..బతుకమ్మ ఎత్తుగా పెరిగేటందుకు గునుగు పువ్యులను మొదలు పెట్టుతారు. కత్తిరించి రకరకాల రంగులతో దాన్ని చిన్నచిన్న కట్టలుగా కట్టి పేరుస్తారు. పువ్యవులను బట్టి పళ్లెం పెద్ద తాంబాళమో తీసుకుని అందులో వృత్తకారంగా అంచునుంచి గోడకట్టిన విధంగా పూవ్యులను కట్టలు పెడుతారు. బతుకమ్మ గట్టిగా నిలబడానికి లోపలివైపు గమ్మడి ఆముదం కాకర బీర ఆకులను విరిచి, ముక్కలు చేసి నింపుకుంటూ ఆంగళం చొప్పున పైకి లేపుతారు… వరుస వరుసకూ పువ్యులు మారతాయి. రంగు మారుతుంది. వెడల్పుగా మొదలవుతుంది. చివరకు శిఖరానికి ఒక పోకబంతి పువ్యు లేదా వంకాయ రంగు వుప్యునో ఉంచుతారు…తల్లి బతుకమ్మతో పాటు, పిల్ల బతుకమ్మను చేయడం తప్పనిసరి.. ఎందుకంటే బతుక్మని ఒంటరిగా పంపకూడదు..
ఇస్తీన్మ వాయినం…!! బతుకమ్మ మరో ఆసక్తీకర అంశం. వాయినం ఇచ్చిపుచ్చుకోవడం. ఒకరిది ఒకరు పంచుకోవడం. ఇదీ తెలంగాణ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆడవి నుంచి సేకరించిన పూలను పంచుకోవడం.మొదలవుతుంది. ఫలహారాన్ని పరస్పరం ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.సద్దుల బతుకమ్మ రోజు చేరువు దగ్గరకు మలీముద్దలు తీసుకుని వెడతారు. రాగి జోన్నులు గోదుమలతో తాయరైన రోట్టే చేసి దాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి దంచి బెల్లం పాకంతో కలిపి చేసిన ముద్దలను బెల్లం పాకంతో కలిపి చేసిన ముద్దలను మలీద ముద్దలంటారు. వాటిని బతుకమ్మ వాయి నాలుగా ఇచ్చిపుచ్చుకుంటారు…!!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు