Wednesday, May 1, 2024

ఓటర్ల కాళ్లు కడిగిన బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్థి వట్టె

తప్పక చదవండి
  • కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటా..
    ` మంత్రి జగదీష్‌ రెడ్డిని ఎదిరించిన ప్రజల కాళ్లు కడిగిన బీఎస్పీ అభ్యర్థి.
  • చందుపట్లలో గజమాలతో స్వాగతం పలికిన యువకులు.
  • ప్రజలలో ఉండి ప్రజల కోసమే పని చేస్తా.
  • బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌.

సూర్యాపేట : అభివృద్ధిపై మంత్రిని నిలదీసి తండా నుంచి తరిమి కొట్టిన ప్రతి ఒక్కరికి కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటానని బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌ అన్నారు.మంగళవారం చివ్వెంల మండలం పాచ్య నాయక్‌ తండా లో పలువురు మహిళల కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకొని వినూత్న రీతిలో ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గ్రామ ప్రజలు ఏ విధంగానైతే మంత్రి జగదీష్‌ రెడ్డిని అభివృద్ధిపై నిలదీశారో, నేను కూడా ఆ విధంగానే పోరాటం చేశానని అన్నారు.అభివృద్ధిపై పోరాటం చేస్తే ఒక్కరోజులోనే 75 అక్రమ కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు.ఈరోజు గ్రామాలలో కూడా జగదీష్‌ రెడ్డిని అభివృద్ధిపై నిలదీస్తున్న, ప్రజలు మొఖం మీదనే ఓట్లు వేయమని చెబుతున్నా, సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు.సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోనీ గ్రామాల తో పాటు పట్టణంలో కూడా బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.జానన్న రావాలి, దొరల పెత్తనం పోవాలనే నినాదం నియోజకవర్గ వ్యాప్తంగా మారు మోగిపోతుందని పేర్కొన్నారు.సద్దల చెరువు కట్టమీద ఐదు కోట్లు ఖర్చుపెట్టి 95 కోట్లు మంత్రి వెనకేసుకున్నాడని ఆరోపించారు. మోడల్‌ మార్కెట్‌, మెడికల్‌ కాలేజీల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వాటిపై చర్చకు నేను సిద్ధం వాణిజ్య భవన్‌ సెంటర్‌ కి రమ్మని సవాలు విసిరిన ఎవరు అట దిక్కు రాలేదని ఎద్దేవా చేశారు.మహిళలకు రూ.2000 లు పింఛన్‌ ఇచ్చి, కడుపులో పుట్టిన కొడుకు,హైదరాబాద్‌ లో రూమ్‌ లు కిరాయి కి ఉంటూ, 5 రూపాయల భోజనం తింటూ, చదువు కొని పరీక్షలు రాస్తే,ఉద్యోగాలు రాక, నిరుద్యోగులుగా మిగిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ఇలా ఎంతోమంది నిరుద్యో గులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, చదువురాని తల్లులకు పింఛన్‌ ఇస్తున్నామని చెప్తూ అధికార పార్టీ నాయకులు పబ్బం గడుపుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బోడబట్ల శ్రీను,కౌన్సిలర్లు దిరావత్‌ నీలాబాయి లింగ నాయక్‌, గండూరి రాధిక రమేష్‌, మాజీ ఎంపీటీసీ గడ్డం సైదులు, కుంభం నాగరాజు, మీరా అక్బర్‌, దేశబోయిన సురేష్‌ యాదవ్‌, శ్రావణపల్లి లలిత, పెరుమాళ్ళ కవిత,జ్యోతి, ధరావత్‌ సుధా కర్‌, కిరణ్‌, సురేష్‌, అనిల్‌, వీరన్న, రవి, బాల తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు