Sunday, May 19, 2024

మొదటి ఉద్యోగం నీకే..

తప్పక చదవండి
  • వికలాంగురాలు రజినీకి రేవంత్ రెడ్డి అభయ హస్తం
  • డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార సభ
  • సభలో మొదటి ఉద్యోగం తనకే ఇస్తామని హామీ
  • స్వయంగా గ్యారెంటీ కార్డు రాసిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే అమ్మాయికి రేవంత్ రెడ్డికి తన ఆవేదన తెలిపింది. రజినీ బాధను విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అయితే.. అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం తనకే ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేశారు. స్వయంగా తానే.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.

అయితే.. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018తో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడిందని చెప్తున్నారు. వాళ్ల నమ్మకానికి సర్వేలు కూడా బలం చేకూరుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. అన్ని విషయాల్లో ఆచీ తూచీ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుంది. అధిష్ఠానం కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించింది. మొన్న ఆరు గ్యారెంటీలు ప్రకటించేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లిఖార్జున ఖర్గే కూడా వచ్చారు. ఇక రేపటి నుంచి ప్రారంభించబోయే ప్రచారానికి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా రానున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది.

- Advertisement -

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పదే పదే కాంగ్రెస్‌ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారన్నారు. బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయన్నారు. నెల రోజుల్లో 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే… మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో 300 కోట్ల మద్యం అమ్మారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, రూపాయి డబ్బు కూడా పంచలేదని స్పష్టం చేశారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారని గుర్తు చేశారు. మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగిందన్నారు. అందుకే తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసిరానన్నారు రేవంత్ రెడ్డి. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరానని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళ్తుందని ఉద్ఘాటించారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించానని తెలిపారు. కేసీఆర్ రాకపోగా… అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారన్నారు. తాము విసిరిన సవాల్ స్వీకరించక పోవడంతో… కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చిందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు