Thursday, October 10, 2024
spot_img

వజ్రలో టిఫిన్‌.. అక్షయ్‌ పాత్రలో ఛాయ్‌

తప్పక చదవండి
  • సాయంత్రం వేళ కార్యకర్తలతో కలిసి ‘బండి’పై టిఫిన్‌ చేసిన బండి
  • సంజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డ యువత

కరీంనగర్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి భారత్‌ టాకీస్‌ సమీపంలోని వజ్ర టిఫిన్‌ బండి వద్ద ఆగారు. కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి అల్పాహారం సేవించారు. అనం తరం ఇటీవల కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, సీని యర్‌ జర్నలిస్టు నగునూరు శేఖర్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుండి నేరుగా కలెక్టరే ట్‌ సమీపంలోని అక్షయ పాత్ర ఛాయ్‌ స్టాల్‌ వద్ద ఆగారు. అక్కడి స్థానిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో కలిసి తేనీరు సేవించారు. బండి సంజయ్‌ వచ్చారనే సమాచారం తెలుసుకున్న వాహ నదారులు తమ వాహనాలను ఆపి సంజయ్‌ తో సెల్ఫీలు దిగారు. ఆ తరువాత పక్కనే ఉన్న సిరి హోటల్‌ వద్దకు వెళ్లి అక్కడున్న వాళ్లను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు