Sunday, September 15, 2024
spot_img

తిరుమల శ్రీవారికి విదేశీ భక్తుడి భారీ విరాళం..

తప్పక చదవండి

తిరుమల బాలాజీ ఆలయానికి ఓ ఎన్నారై భారీ విరాళం అందించాడు. జూన్ 1వ తేదీ గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు మాధవ్ దాస్ టీటీడీ ఇఓ ధర్మారెడ్డికి తన స్నేహితుడితో కలిసి చెక్కులను అందజేశారు.

ఈ విరాళంలో ఎస్.వీ.బీ.సి. ట్రస్ట్‌కు (1.64 లక్షల రూపాయలు) అందించగా, టీటీడీ అధికారులు విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఎస్వీ అన్న ప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేదపారాయణ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని.. ప్రతీ ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం అందించారాయన. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. జూన్ 4న తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. జ్యేష్ఠాభిషేకం దృష్ట్యా ఆదివారం ఆర్జిత సేవను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు ప్లాన్ చేసుకోగలరని కోరారు అధికారులు. కాగా, ఇటీవల కొన్ని రోజులనుంచి తిరుమల ఘాట్‌ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి ట్రాఫిక్‌ విభాగం పటిష్ఠ చర్యలు చేపట్టింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు