Sunday, May 5, 2024

మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా ఎర్రవల్లి మోహన్ చారి

తప్పక చదవండి
  • మల్కాజ్ గిరి హనుమాన్ వ్యాయామశాల నుండి జాతీయ స్థాయి వరకు..
  • 35 సంవత్సరాలుగా వెయిట్ లిఫ్టింగ్ లో రాణిస్తున్న మోహన్ చారి
  • జాతీయస్థాయిలో 3 బంగారు, 1 వెండి పతకాలు..

మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మల్కాజ్గిరి కి చెందిన ఎర్రవల్లి మోహన్ చారి విజయం సాధించారు. ఈ రంగంలో తన 15వ వయసులోనే అడుగు పెట్టిన మోహన్ చారి, అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించారు. ఈ క్రమంలో దాదాపు 50 ముఖ్య పోటీల్లో పాల్గొనగా, అందులో 4 జాతీయ స్థాయివి. ఈ నాలుగింటిలో, 3 బంగారు పతకాలు, 1 వెండి పతకం సాధించడం ఎంతో సంతోషాన్నిస్తుంది అని మోహన్ చారి అన్నారు. ఇటీవల జరిగిన పోటీల్లో 200 మంది పాల్గొనగా, అందులో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించడం గర్వించదగ్గ విషయం అని మల్కాజ్గిరి వాసులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ పోటీలను సమర్ధవంతంగా నిర్వహించిన శృతిరావు శర్మకు కృతజ్ఞతలు తెలిపిన మోహన్ చారి, ఈ యొక్క రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. తన సహచరులు హనుమంత రాజు, రవి ప్రకాష్ లతో కలిసి లాలాపేటలో వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేసి పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సరైన పద్ధతిలో వెయిట్ లిఫ్టింగ్ అలవరచుకుంటే, దీర్ఘకాలిక మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు మంచి దేహదారుఢ్యం, ఆరోగ్యం మన సొంతం అవుతుందని, తల్లిదండ్రులు, ప్రభుత్వం పిల్లలను ఈ దిశగా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు