Saturday, July 13, 2024

అసెంబ్లీలో ఎగురవేసిన త్రివర్ణ పతాకం

తప్పక చదవండి

అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్పీకర్‌ పోచారం అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

హైదరాబాద్‌: అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు.కాగా, శాసన మండలిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. మండలి ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వాణిదేవి, దయానంద్‌, దండె విఠల్‌, పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు