Saturday, April 27, 2024

మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన పోలీసులు

తప్పక చదవండి

కొత్తగూడెం : భద్రతా బలగాలపై దాడికి పథకం వేసిన మావోయిస్టులను కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ వినీత్‌జి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పచర్ల మండలంలో ఎన్నికల విధులకు హాజరైన భద్రత బలగాలపై దాడి చేయడానికి మావోయిస్టులు పెద్దమిడిసిలేరు అటవీప్రాంత రహదారిలో సుమారు 40కేజీల పేలుడు పదార్థాన్ని అమర్చారు.మావోయిస్టులు పన్నిన కుట్రను పసిగట్టిన పోలీసులు బాంబుస్క్వాడ్‌ ద్వారా ఆ ల్యాండ్‌మైన్‌ను గుర్తించి శుక్రవారం ఉదయం నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీ వారి ఉనికిని చాటుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినావాటిని పోలీసులు ధైర్యంగా ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి వెళ్లేక్రమంలో భద్రతాబలగాలపై దాడికి యత్నించిన మావోయిస్టుల కుట్రను భగ్నం చేయడమైందన్నారు. చర్లమండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నివసించేప్రజలను మావోయిస్టులు బెదిరించి భయబ్రాంతులకు గురిచేసినా గాని ప్రభుత్వం, పోలీసులపై నమ్మకంతో ఓటింగ్‌కు హాజరై 90శాతం పోలింగ్‌ జరిగేలా సహకరించిన ఏజెన్సీ ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన సిఆర్‌పిఎఫ్‌ బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించిన జిల్లాప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధమైన సహకారాన్ని అందిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు