Thursday, May 9, 2024

చివ్వెంల ఎస్సై విష్ణు మూర్తిని సస్పెండ్‌ చేయాలి

తప్పక చదవండి
  • ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించిన ఎస్సై బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • పోలింగ్‌ కేంద్రాల్లో ఫోన్‌లో కాలయాపన చేస్తున్న ఎస్‌.ఐలపై అధికారులు చర్యలు తీసుకోవాలి
  • చివ్వెంల గ్రామస్తుల డిమాండ్‌

సూర్యాపేట : ఓటర్లపై అసభ్య పదజాలంతో దూషించి, భయభ్రాంతులకు గురిచేసిన చివ్వెంల మండల ఎస్సై పి. విష్ణు మూర్తిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని చివ్వెంల గ్రామానికి చెందిన ఓటర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం చివ్వెంల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ గురువారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మేము చివ్వెంల మండల కేంద్రంలో ఉన్న జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ ఉన్నత పాఠశాల 203 పోలింగ్‌ బూత్‌ లో ఓట్లు వేసేందుకు మూడు గంటల నుంచి వేచి ఉన్నమని, పోలింగ్‌ బూత్‌లో గ్రామానికి చెందిన వ్యక్తి ఓటు వేద్యానికి లోపలికి వెళ్ళగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రాములు అతని బయటికి వెళ్ళమని చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది ఆ సమయంలో అక్కడే ఫోన్‌ మాట్లాడుతూన్న ఎస్‌ఐ విష్ణుమూర్తి వచ్చి, కానిస్టేబుల్‌ వద్ద ఉన్న లాఠీ తీసుకొని అమాంతం కొట్టడానికి ఓటర్ల మీదకి వస్తూ, అసభ్య పదజాలంతో నూటికి వచ్చిన మాటలతో ఓటర్లను దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్‌ ఎందుకు తిడుతున్నారని మేము ప్రశ్నించడంతో మేము మాట్లాడేది వీడియో తీసుకుంటూ, మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి వీడియో తీశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎస్‌ఐ విష్ణుమూర్తి మాట్లాడేటప్పుడు మా దగ్గర మొబైల్‌ ఫోన్లు అనుమతి లేనందున రికార్డ్‌ చేయలేకపోయామని, ఎస్‌ఐ మాత్రం మేము ఎదురు తిరిగి ఎందుకు తిట్టారని ప్రశ్నించే క్రమంలో తన మొబైల్లో వీడియో రికార్డ్‌ చేశారని తెలిపారు.పోలింగ్‌ కేంద్రంలో అధికార పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు,ప్రజల పట్ల స్నేహపూర్వకంగా ఉండాల్సిన ఎస్‌ఐ, మమ్మల్ని తిట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివ్వెంల మండలంలో అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరి నాయకుల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని మాలాంటి సాధారణ ఓటర్ల పై తన ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఎస్సై విష్ణు ప్రవర్తించిన విధానంపై విచారణ చేసి అతన్ని సస్పెండ్‌ చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో డీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెన్నె మధుకర్‌ రెడ్డి,సీనియర్‌ నాయకులు కొనతం అప్పి రెడ్డి,వేముల చిన్న, ఎం.డి జాఫర్‌,మెరిగా వెంకటేష్‌, సాయి,వేముల మనోహర్‌, శిగ వెంకటేష్‌, కొంతం నరేష్‌ రెడ్డి, అప్పీ రెడ్డి,కుంచం నవీన్‌,నర్సింహా,రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు