Wednesday, May 15, 2024

కన్నీళ్లు పెట్టిస్తున్న హోంగార్డుల కష్టాలు

తప్పక చదవండి
  • ఉన్నతాధికారుల వేదిపులతో ఉసురు తీసుకుంటున్న హోంగార్డులు
  • సమయపాలన లేకుండా చాకిరి, సమయానికి రాని వేతనాలు
  • ప్రభుత్వ శాఖల్లో బతకలేక బతికీడుస్తున్న హోంగార్డులు, డ్రైవర్లు
  • ఉద్యోగ భద్రత లేదు.. కుటుంబాలకు భరోసా లేదు
  • సీఎం దొర.. ప్రసంగాలలోనేనా మీ హామీలు.. ప్రాక్టికల్‌గా ఉండవా
  • దేశంలోనే నెంబర్‌ వన్‌ అంటావు.. రాష్ట్రంలో మాత్రం ఆకలి చావులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల బతుకు చిత్రం దయానియంగా ఉంది తెలంగాణ ఏర్పడితే మన బతుకులు మారుతాయి అనుకున్న హోంగార్డుల కలలు’ కలలుగానే మిగిలాయి. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ హోంగార్డుని పలకరించిన వారి కన్నీటి గాదలే వినిపిస్తున్నాయి. హోంగార్డులు పనిచేసే యంత్రాల్లాగా మారారని వారికి ఎక్కడ కూడా సరైన గుర్తింపు లేక బాధలు అనుభవిస్తున్నారు హోంగార్డుల బతుకు చిత్రం మారుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎవరికి ఎలాంటి భద్రత కల్పించాలన్న హోంగార్డులు తమ ప్రాణాలను పళంగా పెట్టి వారిని రక్షించాలి. కానీ రాష్ట్రంలో వారి పరిస్థితిలను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు ఇదే నా బంగారు తెలంగాణలో హోంగార్డులకు దక్కిన గౌరవమాని వారి కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు.

ఉన్నతాధికారుల వేధింపులతో ఉసురు తీసుకుంటున్న హోంగార్డులు
రాష్ట్రంలో ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఇప్పటికీ ఎంతోమంది హోంగార్డులు ఆత్మహత్యలు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అధికారులు హోంగార్డులను పశువుల కంటే ఈనంగా చూస్తున్నారని వారు తమ వ్యక్తిగత అవసరాలకు గుడ్డు చాకిరి చేయించుకుంటున్నారని అయినా కూడా హోంగార్డులను మనుషులుగా చూడడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు.. ఎంతోమంది హోంగార్డు వారిని వేధించి అధికారులపై ఫిర్యాదులు చేసినప్పటికీని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని హోంగార్డు ఎన్నోసార్లు మీడియా ముఖంగా తెలిపారు. మీడియాల సైతం పలుమార్లు హోంగార్డుల దీనగాథలను ప్రచురించినప్పటికీని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. అధికారులరా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం..! హోంగార్డులను ఇప్పటికైనా మనుషులుగా చూడండి అంటూ హోంగార్డుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -

సమయపాలన లేకుండా చాకిరి సమయానికి రాని వేతనాలు
భద్రత లేని ఉద్యోగంతో ఆపసోపాలు పడుతున్న హోంగార్డులకు సమయపాలన కూడా కరువే. వారికి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఉద్యోగం చేయాలని నిబంధన లేదు ఏ అర్ధరాత్రి, అపరాత్రో పై అధికారి నుండి కూడా పిలుపు వస్తే ఆగ మేఘాల మీద వెళ్లాల్సిందే. ఆరోగ్యం సహకరించకున్న ఉద్యోగం చేయాల్సిందే, హోంగార్డులు వారి కష్టాలనుతోటి ఉద్యోగులకు చెప్పుకొని బాధపడాల్సిందే తప్ప చేసేదేమీ లేదు. ఇది ఇట్లా ఉంటే సమయానికి రాని వేతనాలు. పై అధికారులకు మాత్రం సమయానికి ఒకటి తారీకు నాడే జీతాలు వస్తాయి. మేం మాత్రం జీతం డబ్బుల కోసం వేచి చూడాల్సిందే. రాత్రి పగలు గొడ్డు చాకిరి చేసే హోంగార్డులు, చిన్న ఉద్యోగులు జీతాలు రాక తిప్పలు పడాల్సిందేనా. సమయానికి జీతాలు చేతికి అందక ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేక, పిల్లల ఫీజులు సమయానికి చెల్లించక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణలో చిరు ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న ఉదాసీనత. అంతేకాకుండా పోలీసు వాహనాలు డ్రైవర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని డ్రైవర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వారికి కూడా సమయానికి జీతాలు రాక ఆరోగ్యం సహకరించకపోయిన ఉద్యోగం చేయాలని ఉన్నత అధికారుల వేధింపులు మాత్రం తప్పడం లేదు

ఉద్యోగ భద్రత లేదు చిరుద్యోగుల కుటుంబాలకు భరోసా లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ ప్రభుత్వంలో చిరుద్యోగుల పట్ల అణచివేత ధోరణి కొనసాగుతుంది. ఉద్యోగ భద్రత లేదు, వారి కుటుంబాలకు భరోసా లేదు, ఇదే నా బంగారు తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగుల పరిస్థితి. ఎక్కడైనా వారి హక్కుల కోసం ధర్నాలు, రైతులు చేస్తే వారిపై ఉక్కు పాదం మోపడం కేసీఆర్‌ నైజం. తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలకు వచ్చాక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న చేతులకు ఎక్కడ పొంతనలేదు అని చిరు ఉద్యోగులు అంటున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మాకు సమయం వస్తుంది.. మార్పు తప్పదు దొర అంటూ కొంతమంది వారిలో ఉన్న ఆవేశాన్ని అక్కడక్కడ వెలిబుచ్చుతున్నారు. ఏదేమైనా కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

దొర ప్రసంగాలలో దేశంలోనే నెంబర్‌ వన్‌.. ఎక్కడ నీ అభివృద్ధి
కేసీఆర్‌ ఎక్కడ ప్రసంగాల్లో పాల్గొన్న తెలంగాణ ప్రజలను తానే బతికిస్తున్నట్టు ఉదరగొట్టడం తప్ప చేసింది ఏమీ లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ తానేదో తన సొంత ఆస్తులను ప్రజలకు పంచుతున్న భావనలో ఉన్నారని ప్రజలు కట్టే పనులతో ప్రభుత్వాన్ని నడిపే చేతకాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్‌ అని, తాను తన కుటుంబం అభివృద్ధి చెందుతే ప్రజలు అభివృద్ధి చెందినట్టా! ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో.. నీది ఎంత అసమర్థపాలననో అర్థమవుతుంది. తెలంగాణ నేడు నీ పాలనలో తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. పెన్షన్లు ఇవ్వడం, రైతుబంధు ఇవ్వడం ఇదేనా అభివృద్ధి అంటే. ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని అయినా చేసావా అంటూ తెలంగాణ సమాజం నేడు నిలదీస్తోంది. చాలు దొర.. సెలవు దొర అంటూ నీ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారు. నిరుద్యోగులు కూడా ఏకమవుతున్నారు. చిరుద్యోగులు కూడా నిన్ను ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి.. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ ప్రజలకు అవసరం లేదు ఇలాంటి దొంగ నాయకులను ఇంటికి పంపండి ఎలాంటి విజన్‌ లేని కేసీఆర్‌ లాంటి దుర్మార్గుడ్ని సాగనంపే రోజులు వచ్చాయి. అంటూ హోంగార్డులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే డ్రైవర్లు ఏకమయ్యారు జీవితాలతో చెలగాటమాడిన కెసిఆర్‌ ప్రభుత్వాన్ని కుల్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు