Sunday, May 19, 2024

కెనాల్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మృత్యువాత..!

తప్పక చదవండి

చండీగఢ్‌ : పంజాబ్‌లో ఓ ప్రైవేటు బస్సు కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని ముక్త్‌సర్‌లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో మంది గాయాలకు గురవగా.. 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 నుంచి 65 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రaాబెల్‌వాలి శివారులోని సిర్హింద్‌ కెనాల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ముక్త్సర్‌ నుంచి కొట్కాపురా వైపు వెళ్తోంది. అయితే, ప్రమాద సమయంలో అతివేగంతో వెళ్తున్నట్లు పలువురు తెలిపారు. కాల్వ ఒడ్డున ఏర్పాటు చేసిన ఐరన్‌ గ్రిల్‌ విరిగి ఢీకొట్టిన బస్సు ఆ తర్వాత కాలువలో పడిపోయింది. ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటన బాధాకరమని, ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే అధికారులు ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు