Friday, May 3, 2024

నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు

తప్పక చదవండి
  • మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో నలుగురిని అరెస్ట్
  • నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్న సీఎం బిరేన్
  • మణిపూర్ కు ప్రతినిధి బృందాన్ని పంపే యోచనలో ‘ఇండియా’ కూటమి
    మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మే4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టి కాల్చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మణిపూర్‌కు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు