Saturday, July 27, 2024

కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తేవడమేమనందరి లక్ష్యం

తప్పక చదవండి
  • అందుకోసం నాలుగు మెట్లు దిగి పనిచేయడానికి నేను సిద్ధం.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గాలు లేవు…
  • తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి
  • తొలిసారిగా డీసీసీ కార్యాలయంలో అడుగుపెట్టిన పొంగులేటి.
    ఖమ్మం : కేంద్రంలో… రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే మనందరి లక్ష్యమని… అందుకోసం నాలుగు మెట్లు దిగి అయినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌ గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో పొంగులేటి గురువారం అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు సహా ఇతర కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో వర్గాలు లేవని, ఉన్నదంతా ఒకటే వర్గం కాంగ్రెస్‌ వర్గం అన్నారు. చెప్పిన మాటలు చెప్పకుండా ప్రజలకు మాయ మాటలను చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపటమే మనందరి లక్ష్యమన్నారు. ఇందుకోసం జిల్లాలోని సీనియర్‌ నాయకులతో పాటు ప్రతి కాంగ్రెస్‌ నాయకుడిని, కార్యకర్తను, అభిమానిని కలుపుకుని పోతానన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్‌ గా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు మహ్మద్‌ జావిద్‌, నగర కాంగ్రెస్‌ కార్యనిర్వాహాక అధ్యక్షులు నాగండ్ల దీపక్‌ చౌదరి, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, పుచ్చకాయలు వీరభద్రం, మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, శీలం ప్రతాప్‌ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మొక్కా శేఖర్‌ గౌడ్‌, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షులు సయ్యద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌, రాష్ట్ర ఓబీసీ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, జిల్లా జేబీయం చైర్మన్‌ సైదేశ్వర్‌ రావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్‌ తిలక్‌, మాజీ కౌన్సిలర్‌ పాలకుర్తి నాగేశ్వరావు, నాయకులు తాళ్లూరి హనుమంతరావు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలో అడుగుపెట్టిన పొంగులేటికి ఘనస్వాగతం లభించింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్‌ శ్రేణులు నాయకన్‌ గూడెం నుంచి ఖమ్మం వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు