Sunday, May 19, 2024

చందేపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు

తప్పక చదవండి

యాదాద్రి భువనగిరి : మోటకొండూరు మండలంలోని చందేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8:30 నుండి 12:30 వరకు గణపతి పూజ, స్వస్తి పుణ్యహావచనము, దీక్ష, కంకణధారణ, ఋత్విగ్వరణము, ధ్వజారోహణము వాస్తు నవగ్రహ అష్టదిక్పాలక, పంచ బ్రహ్మ సర్వోత భద్ర మండల స్థాపనలు అగ్ని ప్రతిష్ట హోమాలు అష్టోత్తర శతకలశ పూజ, అభిషేకములు మంత్రపుష్పం మంగళహారతి తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 6 గంటల నుండి ప్రదోషకాల పూజలు కుంకుమార్చన భగవాన్ నామ సంకీర్తన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన బృందం వారిచే నిర్వహించారు.

గురువారం ఉదయం 6 గంటల 45 నిమిషాల నుండి అష్టదిక్పాలక బలిహరణ దిష్టి కుంభము ఉదయం 11 గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణము, తలంబ్రాలు కన్నుల పండుగగా జరగగా భక్తులు కండల పండుగ వీక్షించారు. అనంతరం అన్నదాన మహా ప్రసాదము నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు కోలాట ప్రదర్శనతో రథ ఊరేగింపును అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమం సీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తలు దీక్ష దంపతులు ఏనుగు సత్తిరెడ్డి వసంత ఏనుగు శ్రీకాంత్ రెడ్డి అరుణ ఏనుగు శశికాంత్ రెడ్డి దివ్య లు ఈ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిద్ధాంత కళా ప్రపోర్టన నీర్నేముల సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం దేవాలయ అర్చకులు పండిత్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ కళ్యాణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు సుధగాని భారతమ్మ జయరాములు గౌడ్, సుదగాని మంజుల మల్లేష్ గౌడ్, కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు