Friday, July 12, 2024

మేఘా కృష్ణారెడ్డి సంస్థకు ఆలయ భూములు ధారాదత్తం..

తప్పక చదవండి
 • ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యం..
 • కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం..
 • దైవ భక్తి గలిగిన మేఘా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీకి
  కేటాయించిన ఆలయ భూములను తిరష్కరించకపోవడంలో మర్మం ఏమిటి..?
 • రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే బరితెగించిన
  తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ..
 • చేజారిపోయిన ఆలయ భూములను సాధించడమే లక్ష్యం..
 • ఇదే విషయమై తెలంగాణ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన
  జాతీయ అధ్యక్షులు నామ్ రామ్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాంపూర్ గ్రామంలోని పురాతన హిందూ దేవాలయమైన శ్రీ సీతా రామచంద్ర స్వామికి చెందిన సుమారు రూ.2,200 కోట్ల విలువైన సుమారు 1148 ఎకరాల ఎండోమెంట్ భూమి (సర్వే నంబర్లు 1663 నుండి 1673 వరకు).. కలదు.. ఈ భూమి వివాదాస్పదంలో ఉంది.. దేవాలయ భూమిని చట్టవిరుద్ధంగా ఇతరులకు కట్టబెడుతున్నారని, వాటిని రక్షించాలని కోరుతూ రాష్ట్రీయ వానర సేన జాతీయ అధ్యక్షులు నామ్ రామ్ రెడ్డి, అతని బృందం హై కోర్టులో పిల్ దాఖలు చేసింది.. కాగా తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాంపూర్ గ్రామంలోని ఈ భూమిని తమకు కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయినా తెలంగాణ హై కోర్టు ఆదేశాలను సైతం కాదని తెలంగాణ రాష్ట్ర పభ్రుత్వం బల ప్రయోగంతో మెగా కృష్ణారెడ్డి కి సంబంధించిన సంస్థకు సుమారు 350 ఎకరాల భూమిని కట్టబెట్టింది. మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థ అక్కడ పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలకు ఎటువంటి కోర్టు అనుమతులు లేకుండా మొదలు పెట్టడం జరిగింది.. ఆగ మేఘాలమీద పనులు జరుపుతోంది.. దీని వెనుక పభ్రుత్వ అండదండలు ఉన్నాయి అని రాష్ట్రీయ వానరసేన ఆరోపిస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కోర్టు ఆదేశాలను సైతం కాదని, చట్ట విరుద్ధంగా తన సంస్థకు దేవాలయ భూములు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని.. పరమ భక్తుడైన మేఘా కృష్ణారెడ్డి వారించకపోవడం.. దేవాలయ భూములను కైంకర్యం చేస్తే పుట్టగతులు ఉండవనే విషయాన్ని కృష్ణారెడ్డి ఎందుకని, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి కేటీఆర్ కి చెప్పలేకపోయాడు..? పైకి కనిపిస్తున్నట్లు ఆయనలో భక్తిభావం లేదా..? దోకిపర్రు గ్రామంలో ఆయన నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కేవలం షో పుటప్ కోసమేనా..? అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది కాలమే నిర్ణయించాలి..

- Advertisement -

ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన కూడా పరమ భక్తుడు.. ఏ నూతన కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా పవిత్రమైన యజ్ఞ యాగాదులు నిర్వహించి మొదలు పెట్టడం ఆయనకు అలవాటు.. పలువురు ఆధ్యాత్మిక వేత్తలను ఆయన గౌరవిస్తుంటారు.. గుళ్ళు గోపురాలు అంటే ఆయనకు ఎనలేని మక్కువ.. ఆ కోవలోనే ఆయన యాదగిరి గుట్ట గుడిని కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునికంగా అభివృద్ధి చేయడం జరిగింది.. అదేవిధంగా కొండగట్టు ఆంజేయ స్వామివారి గుడి అభివృధ్ధికోసం, భద్రాచలం రాములోరి ఆలయ అభివృధ్ధికోసం కోట్ల రూపాయల డబ్బును ప్రకటించడం జరిగింది.. మరి అంతటి భక్తిభావం కలిగిన కేసీఆర్ సీతారాం పూర్ లో నెలకొనివున్న శ్రీరాముల వారి ఆలయ భూములను మెగా కృష్ణారెడ్డి కి కట్టబెట్టడంతో ఆంతర్యం ఏమిటి..? ఇతర గుడుల అభివృద్ధికి డబ్బులు కేటాయిస్తున్న ఆయన షాబాద్ మండలం, సీతారాం పూర్, శ్రీరామ మందిర భూములను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ఎందుకు కేటాయిస్తున్నారు..? ఇది మహాపాపం అని తెలియదా..? ఎందరో భక్తులు ఆలయానికి సమర్పించిన భూములను, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా మేఘా కృష్ణారెడ్డి లాంటి పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం సమంజసమా..? కేసీఆర్ ముద్దుల బిడ్డ ఎమ్మెల్స్ కవిత కూడా తరచుగా గుళ్ళు, గోపురాలు సందర్శిస్తుంటారు.. మరి ఇంతటి సంప్రదాయాలను పాటించే ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఏమనాలి..? ఈ వ్యవహారం వెనుక దాగివున్న మతలబేంటి..? అయితే దేవాలయ భూములకు ప్రభుత్వాలు కేవలం ధర్మకర్తలు గానే వ్యహరించాలని, ఆభూములను అమ్మడం గానీ, ప్రయివేట్ వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం చేయరాదని కోర్టులు, చట్టాలు చెబుతున్నాయి.. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ విషయం తెలియదా.. ? తెలిసి కూడా ఏమవుతుందని నిర్లక్ష్యమా..? దీని పర్యవసానం ఆయన అనుభవించక తప్పదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

కాగా మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థకు, షాబాద్ మండలం, సీతారాం పూర్ లోని శ్రీరాముల వారి ఆలయానికి సంబంధించిన భూముల్లో 350 ఎకరాల భోమిని అక్రమంగా కట్టబెట్టింది టీఎస్ఐఐసి.. ఇంత జరుగుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అనిల్ కుమార్.. ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టులో కంటెంట్ మూవ్ చేయకపోవడం ఆయన బానిసత్వానికి నిదర్శనం అంటున్నారు రాష్ట్రీయ వానసేన సభ్యులు.. ఇదే విషయమై తాము తెలంగాణ గవర్నర్ కూడా పూర్తి వివరాలు తెలియజేస్తూ.. ఫిర్యాదు కూడా చేశామని సంస్థ జాతీయ అధ్యక్షులు నామ్ రెడ్డి తెలియజేశారు.. ఈ విషయంలో, రాష్ట్రీయ వానరసేన బృందం, దేవాలయాల పరిరక్షణ సమస్యను పరిశీలించి, కోల్పోయిన దేవాలయ భూములను తిరిగి పొంది, తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయ భూములను సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని.. సంబంధిత వ్యక్తులను ఆదిశగా ఆదేశించాలని గవర్నర్ ని తమ వినతిపత్రంలో కోరారు.. సంబంధిత భూమిని రక్షించి, తిరిగి స్వాధీనం చేసుకునే వరకూ తమ పోరాటం ఆపమని ఆయన హెచ్చరిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు