ఎవరు మారాలి..?
ఎవరి కోసం మారాలి.?
పొద్దున లేచి అరగంట వ్యాయామం
చేయడం చేతకాదు కానీ…
100 యేళ్లు బ్రతికెయ్యాలి
ఓటు వేయడం చేతకాదు కానీ
దేశం మారాలి.
తిరగబడే దమ్ము లేదు కానీ
అవినీతి అంతమవ్వాలి.
ఒక్క మొక్కను కూడా నాటలేం
కానీ కాలుష్యం తగ్గాలి…
బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ
- అరుణ్ రెడ్డి పన్నాల..