Saturday, April 27, 2024

తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్..

తప్పక చదవండి

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టుల భర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ స్కోరు సాధించి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 30.. పోస్టులు : ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్. అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ స్కోరు సాధించి ఉండాలి. వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల‌ మధ్య ఉండాలి. దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (ద‌ర‌ఖాస్తుల‌ను డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్‌ ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్, గ్రౌండ్ ఫ్లోర్, వికలాంగుల సంక్షేమ భవన్‌, నల్గొండ క్రాస్ రోడ్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌-500036) అడ్ర‌స్‌కు పంపించాలి. ఎంపిక : విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000.. పని ప్రదేశం: హైదరాబాద్‌, కరీంనగర్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు. చివరి తేదీ: జూన్ 14.. వెబ్‌సైట్ : wdsc.telangana.gov.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు