వికెట్ తీసిన ఆనందంతో వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ అద్భుతమైన ఫీట్ చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి పిల్లి మొగ్గలేశాడు. యూఏఈతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ఇటీవల అక్కడికి వెళ్లింది. షార్జా క్రికట్ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో భాగంగా శుక్రవారం మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్ రమీజ్ షాజాద్ వికెట్ తీసిన సందర్భంగా సంతోషాన్ని పట్టలేకపోయాడు. ఆనందంతో గాల్లోకి పిల్లి మొగ్గలు వేస్తూ ఆ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ సెలెబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు అతని సెలెబ్రేషన్‌ను ‘గ్రావిటీ డిఫైయింగ్’ (భూమ్యాకర్షణ వ్యతిరేక శక్తి) గా అభివర్ణించారు.
‘వెస్టిండీస్ క్రికెటర్స్ అలాంటి సెలెబ్రేషన్ చేసుకోవడం వెనుక కచ్చితమైన కారణం ఉంటుంది’ అని మరో అభిమాని స్పందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కెవిన్ సింక్లెయిర్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. సింక్లెయిర్ పిల్లి మొగ్గలు వేసిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.