Saturday, March 2, 2024

ఈవీఎంలో భవితవ్యం..

తప్పక చదవండి
  • ముగిసిన తెలంగాణ ఎన్నికలు
  • 65 – 68 శాతం మధ్యలో పోలింగ్‌
  • 3న కౌంటింగ్‌.. ఫలితాల ప్రకటన
  • గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు
  • నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌
  • మొరాయించిన చోట ఈవీఎంల మార్పు
  • చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం

హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ మందకొడిగా ఉందని సమాచారం అందింది. మొత్తం మీద తెలంగాణలో 65 నుంచి 68 శాతం మధ్యలోనే పోలింగ్‌ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గనుంది. 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 3న ఉదయం కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా రాత్రి 7 గంటల తర్వాత పోలింగ్‌ శాతాన్ని ఈసీ అధికారికంగా వెల్లడిరచనుంది. 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పక్రియ ప్రారంభం కాగా, కొన్ని చోట్ల ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌ లో పాల్గొన్నారు. కాగా, కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు క్యూలో ఇబ్బంది పడ్డారు. అటు, హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా మార్పు రాలేదు. సమస్యాత్మక కేంద్రాల్లో 13 నియోజకవర్గాల్లోనే పోలింగ్‌ ముగిసింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 5 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లలో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలియాల్సి ఉంది. సాయంత్రం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. డిసెంబర్‌ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు