Sunday, May 19, 2024

71 మందితో కాంగ్రెస్ లిస్ట్.. !

తప్పక చదవండి
  • అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లు వార్తలు..
  • జాబితా లీకయ్యిందా.. లీకులిచ్చారా.. ?
  • తొలి జాబితాలో గల్లయింతయిన పలువురు సీనియర్లు..
  • కొత్తగా చేరిన లీడర్లకు కాంగ్రెస్ పెద్దల అగ్రతాంబూలం..
  • అలకబూనుతున్న పలువురు సీనియర్లు రేవంత్ పైనే గుర్రు..

హైదరాబాద్ : 71 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయ్యిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ లీకులను కాంగ్రెస్ పెద్దలే లీకు చేశారా .. లేక లీకయ్యిందా .? అనేది అసలు జాబితా విడుదల చేస్తే గాని తెలీదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అభ్యర్థుల జాబితాపై ఇంకా తుది నివేదికను ఇవ్వలేదు. కానీ సింగిల్ నేమ్ నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలు 71 మందితో కూడిన తొలి జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా 71 మంది అభ్యర్థుల తో కూడిన ఇదే లిస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఆమోదించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేస్తుందన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతున్నది.

తొలి జాబితాలో గల్లయింతయిన పలువురు సీనియర్లు :
ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడంఫై రాజకీయ వర్గల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పెద్దలు అగ్రతాంబూలం ఇచ్చినట్లు తాజా లిస్టు ద్వారా తెలుస్తున్నది. భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వ ర్ రావు, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కసిరెడ్డి నారాయణ రెడ్డి, వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ రావుకు వాళ్లు ఆశిస్తున్న స్థానాల్లోనే టికెట్లు దక్కినట్టు లిస్టులో ఉంది.

- Advertisement -

1) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు :
కొడంగల్ – రేవంత్ రెడ్డి .. నారాయణపేట – ఎర్ర శేఖర్ .. జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి .. షాద్ నగర్ – వీర్లపల్లి శంకర్ .. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు.. అచ్చంపేట – వంశీకృష్ణ .. అలంపూర్ – సంపత్ కుమార్.. మక్తల్ – కొత్తకోట సిద్దార్థ రెడ్డి.. దేవరకద్ర – జి.మధుసూదన్ రెడ్డి.. వనపర్తి – మేఘారెడ్డి.. గద్వాల్ – సరిత తిరుపతయ్య .. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి .. నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి .. మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి

2) ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థులు :
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి .. కోదాడ – పద్మావతి.. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆలేరు – బీర్ల ఐలయ్య.. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి .. దేవరకొండ – వడ్త్య రమేశ్ నాయక్ .. నకిరేకల్ – చేముల వీరేశం.. భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. సూర్యాపేట – పటేల్ రమేశ్ రెడ్డి

3) ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులు :
మధిర – భట్టి విక్రమార్క .. భద్రాచలం – పొదెం వీరయ్య .. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు .. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి .. ఇల్లందు – కోరం కనకయ్య..

4) ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు :
ములుగు – సీతక్క.. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ .. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ .. జనగామ – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి .. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి.. పరకాల – కొండా మురళి.. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి .. మహబూబాబాద్ – మురళీ నాయక్..

5) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు :
మంథని – శ్రీధర్ బాబు.. జగిత్యాల – జీవన్ రెడ్డి .. వేములవాడ – ఆది శ్రీనివాస్.. ధర్మపురి – లక్ష్మణ్.. హుజూరాబాద్ – బల్మూర్ వెంకట్ .. పెద్దపల్లి – విజయ రమణ రావు.. కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు .. సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి.. రామగుండం – రాజ్ ఠాకూర్.. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్.. మానకొండూర్ – కవ్వంపల్లి సత్యనారాయణ..

6) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా :
కామారెడ్డి – షబ్బీర్ అలీ.. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్.. బాన్సువాడ – కాసుల బాలరాజ్.. బాల్కొండ – సునీల్ రెడ్డి

7) ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులు :
సంగారెడ్డి – జగ్గారెడ్డి .. జహీరాబాద్ – ఎ. చంద్రశేఖర్.. ఆందోల్ – దామోదర రాజనర్సింహ .. పఠాన్ చెరు – కాట శ్రీనివాస్ గౌడ్ .. నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు.. గజ్వేల్ – నర్సారెడ్డి..

8) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు :
మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు.. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి.. నిర్మల్ – కూచాడి శ్రీహరి రావు.. ముధోల్ – ఆనంద్ రావు పటేల్ .. సిర్పూర్ – రావి శ్రీనివాస్
బెల్లంపల్లి – గడ్డం వినోద్..

9) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థులు :
పరిగి – రామ్మోహన్ రెడ్డి.. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్ .. మహేశ్వరం – చిగురింత పారిజాత.. మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు

10) ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అభ్యర్థులు :
ఖైరతాబాద్ – రోహిన్ రెడ్డి.. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్.. ముషీరాబాద్ – అంజన్ కుమార్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు