Saturday, May 18, 2024

తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..

తప్పక చదవండి
  • తన పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు
  • తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది
  • కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది అవాస్తవం
  • మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం మానుకోవాలి
  • జనసేనతో టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇంకా రాలేదు..
  • ప్రజలు టీడీపీని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది
  • అందుకే దైర్యంగా 119 స్థానాల్లో పోటీ చేస్తున్నాం
  • ఆశాభావం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ
    తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులతో పాటు, మ్యానిఫెస్టో కూడా ప్రకటిస్తామని వారు చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో అన్నిరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును శనివారం మూలఖత్ లో కలవడం జరిగిందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించానని, అలాగే ఆయన ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశామన్నారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, కొద్దిగా బరువు తగ్గారని తెలిపారు.

మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం మానుకోవాలి :
తెలంగాణలో టీడీపీ పోటీపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తమ పైకొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామా, లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.

- Advertisement -

త్వరలో అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల :
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది తాము నమ్మడం లేదన్నారు. తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థులతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం, అలాగే తెలంగాణలో కావలసిన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించారు. బుధవారం మరోసారి చంద్రబాబు నాయుడిని కలిసి అభ్యర్థులు ఎంపిక, జనసేన పార్టీతో పొత్తుపై చర్చించనున్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు