Wednesday, February 28, 2024

ఎన్నికల్లో ఆగం కాకండి చూసి ఓటెయ్యండి

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్ళీ విఆర్ఓ, దళారులు వస్తారు.. జాగ్రత్త
  • ప్రజా ఆశీర్వాద సభలో జనగామ ప్రజలకు కేసీఆర్‌ వరాల జల్లులు
  • ఉమ్మడి రాష్ట్రంలో జనగాం పరిస్థితులు దారుణంగా ఉండేవన్నసీఎం
  • మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు హామీ
  • పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యా లను రెవిన్యూ డివిజన్ చేస్తానన్న సీఎం

హైదరాబాద్ : జనగాం కు సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. అధికారం లోకి వచ్చిన నెలలోనే జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కోరిన విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు.సోమవారం జనగాం లోని మెడికల్ కాలేజీ గ్రౌం డ్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వా ద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యా రు. ఈ సం దర్భం గా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్ని కల్లో జనగాం నుం డి బీఆర్ఎస్ అభ్య ర్థి పల్లా రాజేశ్వ ర్ రెడ్డిని గెలిపిస్తే అధికారం లోకి వచ్చి న నెలలోనే చేర్యా లను రెవిన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించారు. అం తేకాకుండా జనగాం లో మెడికల్ కాలేజీతో పాటు నర్సిం గ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నా మని పేర్కొన్న కేసీఆర్ భవిష్య త్‌లో జనగామ అభివృ ద్ధికి విస్తృ త అవకాశాలు ఉన్నా యని తెలిపారు. వచ్చే ఎన్ని కల్లో పల్లా రాజేశ్వ ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిం చాలని కేసీఆర్ కోరారు.ఎన్ని కల సమయంలో వచ్చి నోటికి వచ్చి నట్లు మాట్లాడి పోయే వాళ్ల మాటలు నమ్మె ద్దని.. ఎన్ని కలు రాగనే ఆగం కావొద్దని.. మం చి చెడు ఆలోచిం చి ఓటు వేయాలని కేసీఆర్ సూచిం చారు. ఇక, ప్రజా ఆశీర్వాద సభలో సుమారు లక్షకు పైగా ప్రజలు హాజరయ్యారని తెలుస్తోంది . సీఎం కేసీఆర్‌, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కటౌట్లు, హోర్డింగ్‌లతో నిండిపోయింది. సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు పొన్నాల. ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ సభ తర్వాత భువనగిరి సభకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం జూనియర్‌ కాలేజీ మైదానంలో కేసీఆర్‌ సభ ఉంది. బోనాలు, బతుకమ్మలు, బైక్‌ ర్యాలీలతో.. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతల ఏర్పాట్లు చేశారు.

జనగాం చూసి కన్నీళ్లు పెట్టుకున్న- సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రం లో జనగాం పరిస్థితులు దారుణంగా ఉండేవని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అప్ప టి పరిస్థితి చూసి కన్నీ ళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. కొందరు ఎన్ని కలు రాగానే నోటికి వచ్చి నట్లు మాట్లాడి వెళ్లిపోతారని.. అలాంటి వారి మాటలు నమ్మె ద్దన్నా రు. జనగాం కు త్వ రలోనే దేవాదుల, కాళేశ్వ రం నుం డి నీళ్లు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఎక్క డ కరువు వచ్చి న జనగాం లో మాత్రం కరువు రాదని అన్నా రు. తెలం గాణ వచ్చా క నాలుగైదు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేథోమధనం చేశామన్నా రు.కరెం ట్ కష్టాలు, నీటి కొరత లేదు, పుట్లకొద్ది పండుతున్నా యి…ఇప్పు డు తెలం గాణ ఎలా ఉం దని అన్నా రు. రైతుల బాధలు తనకు తెలుసని.. అందుకే భూమిపై అధికారుల అధికారాన్ని తీసేసి.. మీ భూమి మీద మీకే అధికారాన్ని ఇచ్చామని తెలిపారు. కానీ పాస్ బుక్‌లో కౌలు రైతులను చేర్చా లని కాం గ్రెస్ వాళ్లు అంటున్నారని సీఎం పేర్కొన్నారు. .. నా ప్రాణం పోయిన ధరణి తీసే పరిస్థితి లేదని కేసీఆర్ కీలక వ్యా ఖ్య లు చేశారు. టీపీసీసీ చీఫ్, సీఎల్పీ నేత భట్టి ధరణిని తీసి బం గాళాఖాతం లో వేస్తారట అని మం డిపడ్డారు. ధరణిని కాదు కాం గ్రెస్‌ను బం గాళాఖాతం లో పడేయాలని ఫైర్ అయ్యా రు. కాం గ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ వీఆర్వో లు వస్తారని అన్నా రు.తన ప్రసంగానికి ముందు.. ముందు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. పొన్నాలతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.ఎమ్మెల్యే కాకముందే సమస్యలను ప్రస్తావించిన పల్లా రాజేశ్వర్రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్.. “పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారుగా ఉన్నాడు అనుకున్నా… ఇంత హుషారు అనుకోలేదు. పల్లా కంటే ముత్తిరెడ్డే నయం.చిన్న చిన్న ఇబ్బందులతో ముత్తిరెడ్డి కి బదులు పల్లా ను ఎన్నికల బరిలో నిలిపాం. ఎన్నికల ముందే పల్లా చాటబారతం అంత లిస్టు ఇచ్చిండు అని కేసీఆర్ చమత్కరించారు. అయితే.. అవన్నీ నెరవేర్చదగ్గ హామీలేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. హామీలన్నీ నెరవేరుస్తామని, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తామని సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి,బి.ఆర్. ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి. జనగామ బి.ఆర్. ఎస్ జిల్లా నాయకులు బండ యాదగిరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు గజ్జి శంకర్.తదితరులు చిట్లా ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు..

- Advertisement -

కాంగ్రెస్ లో నాది 45 ఏళ్ల రాజకీయ జీవితం అది నేటితో సమాప్తం
కాంగ్రెస్ పార్టీ నాకు తీరని అన్యాయం చేసింది -పొన్నాల లక్ష్మయ్య
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. జనగామ బీఆర్ఎస్ బహిరంగ సభలో కండువా కప్పి పొన్నాలను సాదరంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, 18వ వార్డు కౌన్సిలర్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ లో చేరారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య బిగ్ షాక్ ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నియోజవర్గంలో పెద్ద చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పొన్నాల ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని, సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని పొన్నాల వాపోయారు. జనగామ టికెట్ పై పొన్నాల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, టికెట్ దక్కదని తెలిసి తీవ్రంగా నిరాశ చెందారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని పొన్నాల చెప్పారు.
45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. కానీ పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని పొన్నాల వాపోయారు.

కాంగ్రెస్ లో నాది 45 ఏళ్ల రాజకీయ జీవితం అది నేటితో సమాప్తం : పొన్నాల లక్ష్మయ్య

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు