Tuesday, May 7, 2024

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

తప్పక చదవండి
  • కాశ్మీర్‌ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
  • ’ఎక్స్‌’ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఆర్టికల్‌ 370 రద్దుని సమ ర్థిస్తూ దేశ సర్వో న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్‌ తీసు కున్న నిర్ణ యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిం దని పోస్ట్‌ చేశారు. దృఢమైన విశ్వాసం కలిగిన జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజల కలలను సాకారానికి నిబద్ధతతో ఉన్నామని ప్రధాని హావిూ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ’ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. ప్రగతి ఫలాలను సాధారణ ప్రజలతోపాటు సమాజంలో అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు అందజేస్తామని హావిూ ఇచ్చారు. ఆర్టికల్‌ 370 కారణంగా నష్టపోయిన సమాజానికి అభివృద్ధి ఫలాలను అందజేస్తామని అన్నారు. సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదని, ఇదొక ఒక ఆశాకిరణంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, ఉమ్మడి భారతదేశాన్ని నిర్మించాలనే సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు