Thursday, May 2, 2024

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 47 పోస్టులు..

తప్పక చదవండి

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్‌ అండ్‌ రిపోర్టింగ్ అనలిస్ట్ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 47 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్న‌ది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 47
పోస్టులు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ త‌దిత‌రాలు
విభాగాలు : సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్‌ అండ్‌ రిపోర్టింగ్ అనలిస్ట్ త‌దిత‌రాలు
అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివ‌రి తేదీ: జూన్ 05
వెబ్‌సైట్ : @www.sbi.co.in/careers

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు