Thursday, September 12, 2024
spot_img

టెస్లా కార్ల ప్లాంట్‌ ఏర్పాటుపై మస్క్‌ కీలక ప్రకటన..!

తప్పక చదవండి

భారత్‌లో టెస్లా కార్ల ప్లాంట్‌ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్‌కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్‌ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్లాంట్‌ నెలకొల్పే విషయంలో ఇప్పటికే టెస్లా ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రంతో పాటు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని టెస్లా ఆసక్తితో ఉందని ఇటీవల కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఆ తర్వాత భారత్‌లో ప్లాంట్‌ నెలకొల్పే విషయంలో టెస్లా వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించే ఆలోచన ఉంటేనే ప్లాంట్‌ను స్థాపించాలని కేంద్రం టెస్లాకు సూచించింది. ఎలక్ట్రిక్
వాహనాలకు ఇక్కడే తయారు చేయాలని, చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని, అలా అయితేనే టెస్లాకు తాము స్వాగతం పలుకుతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను ఎలాన్‌ మస్క్‌ తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి.

మొదట కార్లను విక్రయించడం, సర్వీస్‌కు అనుమతిస్తేనే తాము ప్లాంట్ నెలకొల్పే విషయంపై ఆలోచిస్తామని, అప్పటివరకు ఎక్కడా ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌ను స్థాపించబోమని మస్క్‌ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి లొకేషన్‌ను ఫైనల్‌ చేసిన తర్వాత.. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటుకు పనులను ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2024 కార్ల ఉత్పత్తి ప్రారంభమై.. 2025 నాటికి భారత్‌లో విక్రయాలకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు