- ఘనంగా జరుగనున్న క్షేత్ర 13వ వార్షికోత్సవాలు..
- ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు విశిష్ట కార్యక్రమాల నిర్వహణ..
- నారాయణపేట జిల్లా, ఊట్కూర్ మండలం, బిజ్వార్ గ్రామంలో
నెలకొన్న దివ్య క్షేత్రం అంబాత్రయ.. - శ్రీ ఆదిత్య పరా శ్రీ గురువు ఆధ్వర్యంలో అపురూప కార్యక్రమాలు..
- కార్యక్రమ వివరాలు తెలియజేసిన క్షేత్ర నిర్వాహకులు..
హైదరాబాద్ : ఓం శ్రీమాత్రే నమః.. అని స్మరించగానే కష్టాలు కడతేరి, మనః శాంతి లభిస్తుంది.. అలాంటి పవితమైన, అద్భుతమైన శక్తి వంతమైన క్షేత్రం శ్రీశ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రం.. ఈ క్షేత్ర 13 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, నవరాత్రి, బ్రహ్మోత్సవములు జరుగనున్నాయి.. శ్రీ ఆదిత్య శ్రీ గురువు ఆధ్వర్యంలో జరుగనున్న బ్రహ్మోత్సవాల విశిష్ట కార్యక్రమాలను క్షేత్ర నిర్వాహకులు తెలియజేశారు..
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి.. ఆదివారం 15-10-2023 నుండి 24-10-2023 శుద్ధ దశమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.. కార్యక్రమ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. తేది: 15-10-2023 ఆదివారం నాడు ఉ.. 9 గం॥ లకు అమ్మవారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తారు..
అక్కడ అమ్మవారికి సర్వోపచార పూజలు చేసి, మరలా పల్లకిలో ఊరేగింపుగా.. మేళ తాళాలతో, 18 మంది బైండ్ల వారి వాయిద్యనాదం, డప్పులు,
అడుగుల భజన, మంగళ వాయిద్యాలు, శంఖధ్వనులు, గంట నాదములు, ఢమురుక నాదములు, ఆటపాటలతో అంగరంగా వైభవంగా ఊరేగిస్తూ.. పసుపు, కుంకుమ.. కావిళ్ళ హరతులు, నారికేళ, కూష్మాండాదులను బలిగా సమర్పిస్తూ.. ఆలయం దగ్గరకు తీసుకువచ్చి ప్రతిష్టింపజేస్తారు.. తరువాత సర్వ కైంకర్యములు జరిపి, మహామంగళ హారతి ఇచ్చి 108 అఖండ జ్యోతులు వెలిగించడం జరుగుతుంది.. కాగా ఈ దివ్య జ్యోతులను 9 రోజులు వెలిగేలా చూస్తారు.. కాగా ప్రతిరోజూ సహస్ర కళశాభిషేకాలు, లక్ష కుంకుమార్చనలు, గంధ, చందనార్చనలు, మారేడు దళాలపై హరి చందన లేదా చందనంతో మహాదేవి యొక్క బీజ మంత్రాలు లిఖించి వాటితో అష్టోత్తర అర్చన గావించి, తులసీ దలార్చనలు, పరమేశ్వరీ ప్రీతికై 7 గురు బ్రహ్మణుల చేత నిత్యము 13 అధ్యాయములతో చండీయాగము నిర్వహించబడును. దీనినే నవ చండీయాగము అంటారు..
నిత్య అన్నదానము :
దుర్గాష్టమి పర్వదినాన అమ్మవారి ముందు మహా పసుపు (భండారు) ఉంటుంది. చివరి రోజు ఆయుధపూజ, శమిపూజ, అమ్మవారి లడ్డు ప్రసాద వితరణ..
తదుపరి అమ్మవారి నిమజ్జనోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే.. ప్రతిరోజు సాయంత్రం పూజానంతరం గర్భా, దాండీయా, నృత్య లహరి ఉటుంది. భక్తాదులు చేరుకోవాల్సిన స్థలం : నారాయణపేట జిల్లా.. ఊట్కూర్ మండలం.. బిజ్వార్ గ్రామం..శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం.. కావున అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా క్షేత్ర నిర్వాహకులు కోరుతున్నారు..