Friday, May 17, 2024

సారీ నేను రాలేను.. ఏమనుకోకండి

తప్పక చదవండి
  • ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
  • ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది
  • అందుచేత విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి
  • ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపిన కవిత
  • సుప్రీం తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా?
  • విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది తేలాలి?

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. 16వ తేదీన ఉదయం 11గంటలకు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే కవితను ఇప్పటికే పలుసార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగ సోమవారం ఈడీ ఇచ్చిన నోటీసులకు కవిత స్పందించారు. తాను విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, తాను విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా కవిత తెలియజేశారు.

గతంలో ఈడీ ఎదుట కవిత హాజరైన సమయంలో ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. తన ఎనిమిది ఫోన్స్ ను ఆ సమయంలో కవిత ఈడీకి సమర్పించారు. 2022 డిసెంబర్ అధికారులు కవితను మొదటిసారి విచారించారు. గతంలో వ్యాపారవేత్త అరుణ్ రాంచద్రన్ పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు. పిళ్లై అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అంతకుముందే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, అ అప్రూవర్లుగా మారారు. ఇదిలాఉంటే .. కవిత విచారణకురానని చెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా? విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు