అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్ చేసిన ఆరోపణలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు. గురువారం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీని, నా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ అన్నారు. వైఎస్ కుటుంబం చీలిందంటే చేతులారా జగనన్న చేసుకున్నదే, జగన్ వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు. నా తల్లి విజయమ్మ’ అని పేర్కొన్నారు. అభివృద్ధి లేకుండా ఏపీ దయనీయ స్థితిలో ఉందంటే కారణం జగనేనని మండిపడ్డారు. జగన్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్లను మంత్రులనుచేస్తానని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్ కోసం నెలల తరబడి 3,200 కి.మీ పాదయాత్ర చేశానని, సమైక్యాంధ్రకోసం కూడా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఎప్పుడు అవసరమొచ్చినా పార్టీకి అండగా నిలబడ్డ. జగనన్న గెలుపు కోసం స్వలాభం చూసుకోకుండా ప్రచారం చేశా’ నని వెల్లడించారు.
రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా. వైఎస్ ఆశయాలు నిలబెడతారని జగన్‌ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. వైఎస్ వారసులమని చెప్పడం కాదు. పనితీరులో కనబడాలని సూచించారు. సీఎం అయిన రోజు నుంచి జగన్ మోహన్ రెడ్డి మారిపోయారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతులను నెత్తినపెట్టుకుని పనులు చేశారని, నాడు వ్యవసాయం పండుగగా ఉంటే నేడు జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మారిందని విమర్శించారు.
తప్పక చదవండి
-Advertisement-