Friday, May 17, 2024

రెండు వేల నోట్లు ఉన్న వారికి ఆర్బీఐ బంపరాఫర్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీ ఐ) ప్రజలకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్‌ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార్చి అంతే విలువైన ఇతర కరెన్సీ నోట్లను వారివారి ఖాతాల్లో తామే జమ చేస్తామని కేంద్ర బ్యాంక్‌ స్పష్టం చేసింది. అలాగే ట్రిపుల్‌ లాక్‌ రిసి ఎª`టాకిల్‌ (టీఎల్‌ఆర్‌) ఫామ్‌ సౌకర్యాన్నీ కల్పించింది. ఇన్సూర్డ్‌ పోస్ట్‌, టీఎల్‌ఆర్‌ ఫామ్‌తో అత్యంత భద్రంగా రూ.2వేల నోట్లను ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ రిజినల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ పీ దాస్‌ తెలి పారు. ఆర్బీఐ రీజినల్‌ ఆఫీసులకు దూరంగా ఉన్నవారి సహాయార్థమే ఈ అవకాశం కల్పించినట్టు చెప్పారు. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చులు కలిసొస్తాయన్నది. అంతేగాక క్యూలైన్లలో నిలబడే బాధా తప్పుతుందని అన్నారు. ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహ రిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటిని బ్యాంకుల్లో, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకునేందుకూ అవకాశం కల్పించింది. తొలుత సెప్టెంబర్‌ 30దాకా గడువు ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. అక్టోబర్‌ 8 నుంచి హైదరాబాద్‌సహా ఆర్బీఐకి చెం దిన 19 ఆఫీసుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోస్టల్‌ సౌకర్యా న్ని తెచ్చింది. ఈసారైతే గడువులేవిూ లేవు. 2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్లను మోడీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో తొలిసారిగా ఈ రూ.2,000 నోట్లను ఆర్బీఐ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు