Saturday, November 2, 2024
spot_img

ప్రీ లాంచ్ మోసంలో బడా తిమింగలాలు..

తప్పక చదవండి

శామీర్ పేట్ కేంద్రంగా భారీ ప్రీలాంచ్ స్కాం..

ప్రీ లంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నో సార్లు హెచ్చరించింది.. ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది.. అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం.. రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ఎత్తుగడలతో.. అమాయకులకు శఠగోపం పెడుతూనే ఉన్నారు.. వీరిని కట్టడి చేయడంలో అధికార ప్రభుత్వం, అధికారులు సైతం విఫలం అవుతుండటం వెనుక అర్ధం కాని గూడుపుఠాణీ దాగివుండనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. రియల్ మాఫియా అక్రమంగా సంపాదించే పైకంలో వీరికి కూడా వాటాలు అందుతున్నాయన్నది వాస్తవం అనుకోవాల్సి వస్తోంది.. తాజాగా శామీర్ పేట్ కేంద్రంగా గత ఏడు సంవత్సరాల కాలంగా యథేచ్ఛగా రియల్ మాఫియా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వస్తోంది.. కాగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ఏజెంట్లను సుశిక్షితులుగా తయారు చేస్తూ.. అమాయక జనాలమీదకు వదులుతున్నారు.. సామాన్య ప్రజానీకాన్ని బురిడీ కొట్టించడంలో ఏజెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నది జగమెరిన సత్యమే..

- Advertisement -

పారిజాత హోంస్ అండ్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భువనతేజ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల యొక్క ప్రీలాంచ్ మాయాజాలం.. అసలు పారిజాత హోంస్ కి, భువన తేజా ఇన్ ఫ్రా కి ఉన్న సంబంధం ఏమిటి..? ఈ రెండు కంపెనీలు మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసుకుని ప్రీ లాంచ్ మోసాలు ఎలా చేస్తున్నారు..? ఎంతమందిని మోసం చేశారు..? శామీర్ పేట్ డివిజన్ లో పారిజాత హోమ్స్, భునతేజ ఇన్ ఫ్రా కంపెనీలు ఏమేమి ప్రాజెక్టులు లాంచ్ చేశారు..? ఎంతమంది కస్టమర్ల దగ్గర నుంచి ఎంతెంత బుకింగ్ అమౌంట్స్ వసూలు చేశారు..? అసలు ఆ ప్రాజెక్టుల యొక్క పూర్తి వివరాలు.. ఈ రెండు కంపెనీలు చేస్తున్న మోసాలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకు రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు