Tuesday, June 18, 2024

జీఓ 111 ఎత్తివేత పెద్ద మోసం..

తప్పక చదవండి
  • న్యాయం కోసం మేం ఎన్జీటీకి వెళ్తాం..
  • ఇందులో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగింది..
  • ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు..
  • కీలక కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : జీఓ 111 ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీఓ పరిధిలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారన్నారు. ఆ తర్వాతే జీఓను ఎత్తివేస్తూ.. ఉత్తర్వులు తెచ్చారన్నారు. 2019 జనవరి తర్వాత 111 జీఓ పరిధిలో కొనుగోలు చేసిన భూముల వివరాలు బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 111 జీఓ ఎత్తివేత్తపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కి వెళ్తామన్నారు. ఈ విషయంపై తాము అక్కడే తేల్చుకుంటామని అన్నారు. ఏ పార్టీ నేతలైనా సరే ఈ జీఓ పరిధిలో భూములు కొన్న వారి వివరాలు బయట పెట్టాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇక ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టేందుకు మంత్రి కేటీఆర్ కుట్ర చేస్తు్న్నారన్నారు. రూ. లక్ష కోట్ల విలువైన ఈ కుట్రకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారానికి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్‌లు సహకరిస్తున్నారని అన్నారు. ఓఆర్ఆర్ 30 ఏళ్ల టోల్ కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయని కేటీఆర్ చెప్పిన సంస్థకు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. వేల కోట్ల విలువైన కాంట్రాక్టులపై రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎలా సంతకాలు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “లక్ష కోట్ల ఆస్తిని రూ.7,388 కోట్లకే కొల్లగొట్టిన కంపెనీ.. రూ.738 కోట్లు చెల్లించాలి. హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. హెచ్‌జీసీఎల్ ఎండీగా హడావుడిగా బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఐఏఎస్ అధికారి ఉండాల్సిన పదవిని రిటైర్ అధికారికి ఎందుకు అప్పజెప్పారు..? ఐఆర్‌బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49 శాతం వాటా అమ్మేశారు. తేజరాజు, రాజేష్ రాజు కేటీఆర్ సింగపూర్ వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నారు..? అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు. అందుకే కేటీఆర్ గూడుపుఠానీ సమావేశాలు.

- Advertisement -

ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చింది. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయి. షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు ఎవరో.. యువరాజులు ఎవరో తేలాలి. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాలి. లేకపొతే సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. అరవింద్ కుమార్ నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు..? ఆయన కేవలం కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే తాబేధారా..? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. మజెల్స్ సంస్థ నివేదిక తప్పు అని తేలింది కదా.. 10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు..?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యనించారు. అక్రమంగా సంపాధించుకున్న వేల కోట్లను పెట్టుబడులు పెట్టేందుకే ఆయన యూకే, అమెరికాలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని.. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ, కాగ్ సంస్థలకు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు. తన టికెట్‌తో సహా ప్రతి టికెట్‌ కు సర్వేనే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. కర్ణాటకలో సిద్దరామయ్యకు కూడా అడిగిన టికెట్‌ కాకుండా సర్వే ఆధారంగానే మరో స్థానం నుంచి టికెట్‌ ఇచ్చారని చెప్పారు. తనతో పాటు పార్టీలో కొత్తగా చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఇన్‌ఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని, ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చ చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని రేవంత్‌ రెడ్డి వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు