Friday, May 17, 2024

ప్రజాస్వామిక వ్యవస్థకు పంచాయితీలే పట్టుగొమ్మలు

తప్పక చదవండి
  • జిల్లాల అభివృద్దిలో పంచాయితీ సభ్యులే కీలకం
  • పంచాయితీ పరిషత్‌ సమావేశంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : పంచాయతీలు ప్రజాస్వామిక వ్యవస్థకు మూల స్తంభాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. జిల్లాల అభివృద్ధి కోసం జిల్లా పంచాయతీ సభ్యులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. డామన్‌ అండ్‌ డయ్యూలో జరుగుతున్న క్షేత్రీయ పంచాయతీరాజ్‌ పరిషత్‌ను ఉద్దేశించి ఆయన శుక్రవారం వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పంచాయతీ సభ్యులు కృషి చేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు శ్రమించాలని కోరారు. మీ జిల్లాలో పదో తరగతి, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వండి. క్రీడల్లో ప్రశంసలు పొందడానికి మార్గదర్శనం చేయండి, మరింత ఎక్కువ మందికి టీకాకరణ జరిగేలా కృషి చేయండని చెప్పారు. సమష్టితత్వం చాలా విలువైనదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నమ్ముతాయని చెప్పారు. ఆ దిశగానే అవి పని చేస్తున్నాయని చెప్పారు. వ్యవస్థ, విలువలు, అంకిత భావం పట్ల తమకు నమ్మకం ఉందని, సమష్టి బాధ్యత స్ఫూర్తితో తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. తమకుగల అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం శక్తి, సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకునే పక్రియను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు