Saturday, April 27, 2024

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్‌ కెప్టెన్‌..

తప్పక చదవండి
  • ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌
    కొలంబో: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ బద్దలు కొట్టాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య ‘ఆసియా కప్ – 2023’ టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది వన్డే కెరీర్‌లో 19వ వన్డే సెంచరీ. సెంచరీతో చెలరేగిన బాబర్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. కోహ్లీ అత్యధిక స్కోర్ 136 కాగా, ఇప్పుడు బాబర్‌ ఆజమ్‌ 151 పరుగులు చేశాడు. అంతేగాక వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా బాబర్‌ ఆజమ్ రికార్డు నెలకొల్పాడు. బాబర్‌ ఈ ఫీట్‌ను 102 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్‌ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా మరో ఇద్దరిని బాబర్‌ అధిగమించాడు. భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ అంతర్జాతీయ వన్డేల్లో 5,238 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డామియన్ మార్టిన్‌ 5,346 పరుగులు సాధించాడు. తాజా సెంచరీతో బాబర్‌ ఆజమ్ ఆ ఇద్దరిని దాటేశాడు. ఇప్పటివరకు 102 వన్డే ఇన్నింగ్స్‌లో బాబర్‌ 5,353 పరుగులు చేశాడు. ఈ విధంగా ఒక్క మ్యాచ్‎తో బాబర్ మూడు రికార్డులు బద్దలు కొట్టినట్లయ్యింది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు