Friday, May 3, 2024

విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలి

తప్పక చదవండి
  • కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌
  • క్రైమ్‌ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి
  • ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

గజ్వేల్‌ : విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు, బుధవారం కుకునూరు పల్లి పోలీస్‌ స్టేషన్ను సందర్శించారు. కుకునూరు పల్లి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ పరిసరప్రాంతాలు నాటిన మొక్కలను పరిశీలించారు. వివిధ కేసులలో సీజ్‌ చేసిన వాహనాలు, అబ్బాండెడ్‌ వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజల్‌ చేయాలని ఎస్‌ఐ పుష్పరాజు కు సూచించారు. 5%ం% ఇంప్లిమెంటేషన్‌ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలనిసూచించారు పోలీస్‌ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. నామినల్‌ రోల్స్‌ ను పరిశీలించి తనిఖీ చేసి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ లో అలర్ట్‌ చేసిన డ్యూటీల ప్రకారం నామినల్‌ రోల్లో ఉండాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు యొక్క పనితీరును, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు, గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్‌ స్టేట్మెంట్‌ ను పరిశీలించి, అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ లో ఉన్న సిడి ఫైల్స్‌ ను, పెండిరగ్‌ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్‌ కేసెస్‌ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. పోలీస్‌ అధికారులు సిబ్బందితో ఇంట్రాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు.

సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అనంతరం వారు మాట్లాడుతూ విధినిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు ప్రతినెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మరియు ఫంక్షనల్‌ వర్టికల్‌ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్‌ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాది దారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్‌ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు.రాబోవు ఎన్నికల సందర్భంగా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. తరచుగా గ్రామాలను పోలింగ్‌ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. రాత్రి పెట్రోలింగ్‌ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో రోల్‌ క్లారిటీ, గోల్‌ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలన్నారు, విపిఓ పోలీస్‌ ఆఫీసర్‌ వారంలో రెండు మూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ఉన్న సమస్యలపై ఆరా తీయాలన్నారు, సైబర్‌ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిసీటిఎన్‌ఎస్‌ (క్రైమ్‌ మరియు క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌ వర్క్‌%డ% సిస్టం) ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్‌.ఐ.అర్‌ లను, సిడిఎఫ్‌, పార్ట్‌-1, పార్ట్‌-2 రిమాండ్‌ సిడి, ఛార్జ్‌ షీట్‌, కోర్టు డిస్పోజల్‌ ఆన్లైన్‌ లో ప్రతి రోజు ఎంటర్‌ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్‌ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్‌ ఉండాలని కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్లను పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచినందుకు ఎస్‌ఐ ని మరియు సిబ్బందిని అభినందించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్‌ పోలీసింగ్‌ విధులు నిర్వహించాలని. పోలీస్‌ అధికారులకు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే హెచ్‌ఆర్‌ఎంఎస్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా పంపించాలని హెచ్‌ఆర్‌ఎంఎస్‌ లో ఉన్న అన్ని మాడ్యూల్స్‌ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, రోజుకు ఒకసారి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ లో ఉన్న సర్వీస్‌ రికార్డ్స్‌ ను లీవ్‌ తదితర అంశాలను చెక్‌ చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ రికార్డ్స్‌ సిడి ఫైల్స్‌ లో ఇన్వెస్టిగేషన్‌ ఎస్‌ఓపి ప్రకారం క్రమ పద్ధతిలో ఉన్నందున ఎస్‌ఐ సిబ్బందిని అభినందించారు.నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌ స్టేషన్‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్‌ ఏసిపి రమేష్‌, తొగుట సీఐ కమలాకర్‌, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు మరియు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు